పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ రీమేక్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు కొస్తున్నారు. మూడున్నరేళ్ల పాటు రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ స్టార్ ఆ సమయంలో సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. గత ఏడాది రీమేక్ మూవీ 'వకీల్ సాబ్'తో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. పవర్ ఫుల్ లాయర్ గా పవన్ నటించిన ఈ మూవీని బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా తెరకెక్కించారు. శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
ఈ మూవీ తరువాత ఇదే ఊపులో పవన్ కల్యాణ్ మరో రీమేక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అదే 'భీమ్లానాయక్'. మలయాళ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. రానాతో కలిసి పవన్ నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత పవన్ మరో రీమేక్ మూవీకి రెడీ అయిపోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఓ ఆసక్తికరమైన చర్చకు తెర తీశారు.
పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమాలతో పాటు తను వదులుకుని హిట్‌లుగా, ఫ్లాప్ లుగా నిలిచిన చిత్రలపై సోషల్ మీడియా వేదికగా చర్చిస్తుంటారు. గతంలో రవితేజ నటించిన 'ఇడియట్', సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'పోకిరి' చిత్రాలు ముందు పవన్ కల్యాణ్ కే వచ్చాయి. అయితే వాటిని పవన్ వదులు కోవడంతో రవితేజ, మహేష్ ల కెరీర్ లని మలుపుతిప్పాయి. ఇలాంటి బ్లాక్ బస్టర్ లని పవన్ ఎందుకు వదులుకున్నారని పవన్ ఫ్యాన్స్ అప్పుడప్పుడు ఫీలవుతుంటారు.
అయితే ఇందులో పవర్ వదులు కోగా ఫ్లాప్ అయిన సినిమాల గురించి కూడా చర్చిస్తుంటారు. తాజాగా పవన్ ఫ్యాన్స్ దృష్టి హీరో సత్యదేవ్ నటించిన 'గాడ్సే' మూవీపై పడింది. సీ. కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కించాడు. సామాన్యుడు వ్యవస్థపై చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్ర భారీ డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది.
అయితే ఈ మూవీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేయాలనుకున్నానని, అయితే ఆయన డేట్స్ కుదరవని తెలిసి ఆయనకు కథ చెప్పే సాహసం చేయలేదనిఈ మూవీ రిలీజ్ సమయంలో దర్శకుడు వెల్లడించారు.
దీంతో ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్న పవన్ ఫ్యాన్స్ 'గాడ్సే' కథ పవన్ దృష్టికి పవన్ దృష్టికి వెళ్లకపోవడమే మంచిదైంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ లు చేస్తున్నారట. పవన్ గనక ఈ సినిమాని పొరపాటున చేసి వుంటే డిజాస్టర్ కా బాబ్ అయ్యేదని వాపోతున్నారు. ప్రస్తుతం వీరి ట్వీట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.