సంక్రాంతి హడావుడి ముగిసిపోవడంతో.. ఇప్పుడు అందరూ కూడా జనవరి 25 మరియు 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. మరి సంక్రాంతికి ఒక్క సినిమా కూడా సరైన స్థాయిలో ఎంటర్టయిన్మెంట్ అందివ్వలేకపోయింది కాబట్టి.. ఈ కొత్త హాలిడే సీజన్ అయినా కనకరిస్తుందా అనేదే అందరి ఆసక్తికీ కారణం.
ఇకపోతే రిపబ్లిక్ డే రిలీజుల్లోమనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రిలీజ్ అంటే.. భాగమతి గురించే మాట్లాడుకోవాలి. మనం ఎప్పటినుండో చూస్తున్న థ్రిల్లర్లే అయినప్పటికీ.. ఆ సినిమాలో అనుష్క లుక్ అండ్ దర్శకుడు అశోక్ తాలూకు విజన్ చాలా కొత్తగా కనిపించాయి. అందుకే ట్రైలర్ కు అంతమంది దాసోహం అయిపోయారు. ఇకపోతే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమాలో ఫస్టాఫ్ అంతా కూడా కథను ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోగా.. సినిమాలో సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందట. ఎందుకంటే రెండో అనుష్క.. భాగమతిగా కనిపించే భాగం అదే. ముఖ్యంగా మధ్యలో ఒక 20 నిమిషాలు పాటు అనుష్క ఇరగదీసింది అంటున్నారు సన్నిహితులు.
ఏదేమైనా కూడా.. టాలీవుడ్ లో 2018లో తొలి హిట్ ఎవ్వరు కొడతారు అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. మరీ మమ్మల్ని సమ్మర్ వరకు వెయిట్ చేయించకుండా ఆ హిట్టేదో త్వరగా కొట్టేయ్ సుందరి.