బాలీవుడ్ వెటరన్ నటి భ్యాగ్యశ్రీ కోలీవుడ్ చిత్రం `తలైవి`తో మళ్లీ కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంతో భాగ్యశ్రీ జయలలిత తల్లి సంధ్య పాత్రలో మెప్పించారు. ఆ రకంగా వెటనర్ నటికి మంచి కంబ్యాక్ మూవీగా తలైవి నిలిచింది. అయితే భాగ్య శ్రీ అంతకు ముందే ఓ కన్నడ సినిమాలో నటించారు. కానీ మళ్లీ ఏడాది గ్యాప్ తీసుకుని ఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న `రాధేశ్యామ్` లో భాగ్య శ్రీ నటిస్తున్నారు.
తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగ్య శ్రీ గ్యాప్ ఇవ్వడానికి గల కారణాల్ని రివీల్ చేసారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వృత్తికి వల్ల దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ``కుడిచేయి దెబ్బతినడంతో కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది. చేయి పైకి...కిందకి కదపడం కష్టమైందని...తీవ్రమైన నొప్పితోనూ బాధపడినట్లు తెలిపారు. అయితే శస్త్ర చికిత్స అసరమని డాక్టర్లు సూచించిన అందుకు సాహసించలేదని..కేవలం ఎక్సరసైజ్ ద్వారానే చేయిని తిరిగి కోలుకునేలా చేసానన్నారు. స్వీయ వైద్యం ద్వారా చేయి యథాస్థానానికి వచ్చిందని అందుకు తరుచూ యోగాలు...చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కోలుకున్నట్లు తెలిపారు.
ఏడాది పాటు ఆ పనిలోనే నిమగ్నమయ్యాను. నా చేయి కోలుకోవడం చూసి డాక్టర్ల షాక్ అయ్యారు. నా టెలివిజన్ షో `లౌట్ ఆవో త్రిష ` సమయంలోనే కుడి చేయి కదలిక లేకుండా పోయిందని అప్పటి నుంచి ఇబ్బంది పడి చివరికి కోలుకున్నానని భాగ్య శ్రీ తెలిపారు. ప్రస్తుతం భాగ్య శ్రీ వయసు 52 ఏళ్లు. వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ మళ్లీ బిజీ అవుతున్నారు. 1989లో సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియాతో భాగ్య శ్రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.