బాలీవుడ్ వెటరన్ నటి భాగ్య శ్రీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. `మైనే ప్యార్ కియా” తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ అటుపై `ప్రేమపావురాలు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ..రాజశేఖర్ హీరోగా నటించిన పలు సినిమాల్లో భాగ్య శ్రీ నటించారు. `యువరత్న` `రాణా`. ..`ఓకారం` లాంటి సినిమాలు భాగ్య శ్రీకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అటుపై కన్నడ..మరాళీ..బోజుపురీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసారు. అయితే పెళ్లి తర్వాత భాగ్య శ్రీ సినిమాలకు దూరమయ్యారు. కటుంబ జీవితానికే సమయం కేటాయించి ఆ లైఫ్ లో బిజీ అయ్యారు. సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు.
అయితే మళ్లీ `రాధేశ్యామ్` చిత్రంతో భాగ్య శ్రీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఇందులో ఆమె ప్రభాస్ కి తల్లి పాత్రలో నటిస్తున్నారు. చాలా మంది సీనియర్ హీరోయిన్లు ఉన్నా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఆమెనే ఎంపిక చేసారు. ఓ కొత్త సీనియర్ నటి అయితే ప్రెష్ ఫీల్ ఉంటుందని భాగ్య శ్రీని తీసుకున్నారు. అయితే ఈ పాత్రని ఆమె అంగీకరించడానికి గల కారణాల్ని భాగ్య శ్రీ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ``డైరెక్టర్ రాధకృష్ణ నా పాత్రని చాలా చక్కగా నెరేట్ చేసారు. ఆ పాత్రకి సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంది. యూవీ లాంటి పెద్ద బ్యానర్ వెనుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. వీటితో పాటు నా పాత్ర చాలెంజింగ్ గా ఉంటుంది. అందుకే ఒప్పుకున్నా. నేను పెద్ద డాన్సర్ ని కాదు. కానీ ఈ సినిమాలో డాన్సు చేయాల్సి వచ్చింది. కథ డిమాండ్ చేసింది కాబట్టి తప్పలేదు. మొదటి రోజు సెట్స్ల్ లో ప్రభాస్ కనిపించినప్పుడు ఎలా పరిచయం చేసుకోవాలని ఆలోచించాను. కానీ ప్రభాస్ నా దగ్గరకు వచ్చి తనకు తానే పరిచయం చేసుకున్నారు. చిన్న ప్పటి నుంచి నా ప్యాన్ అని చెప్పడంతో షాక్ అయ్యాను. ఆయన చాలా డౌన్ టూ ఎర్త్ అని ంతా చెబితే విన్నాను .
మొదటిసారి లైవ్ లో చూసాను. చాలా సర్ ప్రైజింగ్ అనిపించింది. పాన్ ఇండియా స్టార్ అయినా ఇసుమొత్తు కూడా గర్వం లేని మనిషి. ప్రభాస్ సెట్స్ లో ఉంటే ఫ్యామిలీ వాతావరణం కనిపిస్తుంది. అంతగా అందరితో కలిసి పోతారు. అలాగే ఇలా మళ్లీ సినిమాలు చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. భర్త సహకారం ఉంది. ఆ కారణంగానే మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాను అని భాగ్య శ్రీ తెలిపారు.