పావురం కొడుకు హీరో అవుతున్నాడు

Update: 2017-04-04 14:04 GMT
ఓ తరం వెనుక బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ అంటే కొన్ని లక్షల మందికి కలలరాణి. బుల్లితెరపై అలరిస్తూనే.. మైనే ప్యార్ కియా మూవీతో సినీ అరంగేట్రం చేసింది భాగ్యశ్రీ. సల్మాన్ ఖాన్ తో కలిసి భాగ్యశ్రీ నటించిన ఈ చిత్రం.. తెలుగులో ప్రేమపావురాలు పేరుతో రిలీజ్ కాగా.. ఇప్పటికీ ఈ సినిమా.. సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.

ఇప్పటికీ బుల్లితెరపై భాగ్యశ్రీ సందడి చేస్తూనే ఉండగా.. ఇప్పుడీమె తన కొడుకును హీరో చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ ట్రయల్స్ ఓ దారికి వచ్చేయగా.. భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు దాసాని అరంగేట్రం ఖాయమైంది. 'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' అనే టైటిల్ పై తెరకెక్కనున్న చిత్రంతో పరిచయం అవుతండగా.. ఇదే మూవీతో రాధికా మదన్ హీరోయిన్ గా తెరంగేట్రం చేయనుంది. యాక్షన్ కామెడీ జోనర్ లో రూపొందనున్న ఈ మూవీని అనురాగ్ కశ్యప్ నిర్మిస్తుండడం విశేషం.

మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్ ను వాసన్ తనకు చెప్పిన తీరు బాగా నచ్చడంతో నిర్మిస్తున్నట్లు అనురాగ్ కశ్యప్ తెలిపాడు. గతంలో పెడ్లర్స్ మూవీ రూపొందించిన వాసన్.. ఇప్పుడు ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యానర్ పై.. మర్ద్ కో దర్ద్ నహీ హోతాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News