టాక్ బావుంది.. గ్యాప్ ఇచ్చుంటే...

Update: 2015-09-06 15:53 GMT
ఈ శుక్ర‌వారం మూడు సినిమాలు రిలీజయ్యాయి. మూడింటికి జ‌నాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాలు బాగున్నాయ‌న్న టాక్  వ‌చ్చింది. థియేట‌ర్ల‌న్నీ క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి కూడా. ఇలా ఒక‌టికి మించి ఒకేసారి గంప‌గుత్త‌గా సినిమాలు రిలీజ‌వ్వ‌డం వ‌ల్ల థియేట‌ర్ య‌జ‌మానుల‌కు బాగానే ఉంటుంది కానీ, ఆ సినిమాలు తీసిన నిర్మాత‌ల ప‌రిస్థితేంటి? అంటే .. లాభాల్ని షేర్ చేసుకోవ‌డ‌మే మ‌రి.. అని చెబుతున్నారు అన‌లిస్టులు.

ఒకేసారి మూడు సినిమాలు రిలీజైతే ఏది సెల‌క్ట్ చేసుకో్వాలో ఆడియెన్‌ కి క‌న్ఫ్యూజ‌న్‌. ఈ క‌న్‌ ఫ్యూజ‌న్‌ లో ఎటు కొట్టేస్తారో తెలీదు. ఏ టిక్కెట్టు తెగుతుందో అంచ‌నా వేయ‌డం క‌ష్టం. అలాంట‌ప్పుడు లాభాలు ఎలా వ‌స్తాయి? ఒకే సారి ఆడియెన్‌ ని ముగ్గురు పంచుకోవ‌డం అంటే ఇబ్బందే క‌దా! అని  అంటున్నారు. అలా కాకుండా వారానికి ఒకే సినిమా వ‌స్తే ఆ మేర‌కు లాభాల పంట పండించ‌వ‌చ్చు క‌దా .. అని విశ్లేషిస్తున్నారు. అయితే జ‌నాల‌కు న‌చ్చింది సెలెక్ట్ చేసుకునే అవ‌కాశం ఇవ్వ‌కుండా మోనోప‌లి చేసి ఒకే సినిమా రిలీజ్ చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ క‌రెక్టు? అని అడిగేవాళ్లు కూడా ఉన్నారు.           

షాపింగ్ మాల్‌ కి వెళ్లిన‌ప్పుడు న‌చ్చిందే కొనుక్కుంటాం. అలాగే న‌చ్చిన సినిమానే చూస్తాం.. అని వారంటున్నారు. కాబ‌ట్టి ఈ వారం మూడు సినిమాలు వ‌చ్చాయి.. వాటిలో ఎవ‌రికి న‌చ్చిన జోన‌ర్ వాళ్లు సెలెక్ట్ చేసుకుంటారు. డైన‌మైట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మోడ్‌ లో సాగే సినిమా. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ రొమాంటిక్ కామెడీ, విశాల్ సినిమా ఎగైన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. కాబ‌ట్టి ఎవ‌రికి న‌చ్చిన జోన‌ర్ వాళ్లు ఎంచుకుని వెళ్లండి మ‌రి. ఒకేసారి ఇన్నేసి సినిమాలు రిలీజ‌వుతుంటే థియేట‌ర్ ఓన‌ర్లు ఖుషీగానే ఉన్నారు. థియేట‌ర్ల ద‌గ్గ‌ర క‌ళ పెరిగింది. ఇదీ ఒకందుకు మంచిదే అనుకోవాలేమో!
Tags:    

Similar News