ఒక భాషలో ఓ సినిమా హిట్టయిందంటే చాలు.. వెంటనే పొరుగు ఇండస్ట్రీల చూపులు ఆ సినిమా మీద పడిపోతాయ్. ఫ్యాన్సీ ఆఫర్ లతో రీమేక్ రైట్స్ కోసం పోటీ మొదలైపోతుంది. ‘భలే భలే మగాడివోయ్’ విషయంలోనూ అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మతిమరుపు కాన్సెప్ట్ ఏ భాషలో అయినా నవ్వులు పూయిస్తుంది కాబట్టి.. రిలీజైన వారానికే మంచి రీమేక్ ఆఫర్ లు వస్తున్నట్లు సమాచారం. ఇటు తమిళం నుంచి, అటు కన్నడ నుంచి ‘భలే భలే మగాడివోయ్’ రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే నిర్మాతల ఆలోచన మరోలా ఉంది. కన్నడ వరకైతే రీమేక్ రైట్స్ ఇచ్చేయడానికి ఓకే కానీ.. తమిళం వరకు మాత్రం నేరుగా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలని యోచిస్తన్నట్లు సమాచారం.
నానికి తమిళంలో మంచి గుర్తింపే ఉంది. వెప్పం (సెగ) - నాన్ ఈ (ఈగ) సినిమాలతో అక్కడ మంచి గుర్తింపే సంపాదించాడు మనోడు. కథాంశం ఎవరికైనా నచ్చేదే కాబట్టి.. నేరుగా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తే రీమేక్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం కంటే ఎక్కువ సంపాదించవచ్చని అల్లు అరవింద్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. భలే భలే మగాడివోయ్ ఇప్పటికే పెట్టుబడి మీద మూడు రెట్ల దాకా సంపాదించి పెట్టింది. ఐదారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సులభంగానే రూ.20 కోట్ల షేర్ కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇంకా శాటిలైట్ రైట్స్ ద్వారా రూ.3 కోట్ల దాకా వస్తోంది. కన్నడ రీమేక్ రైట్స్ - తమిళ డబ్బింగ్ వెర్షన్ ఆదాయం కూడా కలుపుకుంటే లెక్క ఎక్కడో ఉంటుంది. మారుతి తొలి మూడు సినిమాల్లాగే లాభాల విషంయలో ‘భలే భలే మగాడివోయ్’ సంచలనం సృష్టించబోతున్నట్లే.