అంచనా నిజమైంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే బిగ్ బాస్ కంటెస్టెంట్ విషయంలో ఎలాంటి సర్ ప్రైజ్ చోటు చేసుకోలేదు. ఊహించినట్లే భానుశ్రీ ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ అంటేనే.. సస్పెన్స్.. ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. దీనికి కొనసాగింపుగా ఏమైనా జరగొచ్చన్న ట్యాగ్ లైన్ తో స్టార్ట్ అయిన బిగ్ బాస్ 2 సీజన్ లో పెద్ద సస్పెన్స్ ఏమీ ఉండటం లేదు.
గతవారం ఎలిమినేషన్ కు సంబంధించి హౌస్ మేట్స్ కు ఛాలెంజ్ ఇవ్వటం.. దానికి వారంతా తమ మధ్యనున్న స్నేహంలో భాగంగా ఓకే చెప్పటం తెలిసిందే. అందరికి ఒక్కో టాస్క్ ఇచ్చి.. భానుశ్రీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం క్లిష్టమైన రెండు టాస్క్ లు ఇచ్చి ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొన్న వేళలోనే.. ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేందుకు రంగం సిద్ధమైందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమైంది.
దీన్నినిజం చేస్తూ.. భానుశ్రీను ఎలిమినేట్ కాకుండా సాయం చేసే స్థానంలో ఉన్న అమిత్.. అడ్డం తిరగటంతో భానుశ్రీ ఎలిమినేషన్ ఎదుర్కొన్న ముగ్గురిలో ఒకరైంది. దీనికి తోడు.. ఆ మధ్య ఇచ్చిన టాస్క్ లో తన టీ షర్టులో కౌశల్ చేయి పెట్టాడని.. తన చెస్ట్ తాకాడంటూ అసత్య ఆరోపణలు చేయటం.. ఆ తర్వాత తాను తప్పుగా మాట్లాడానని.. సారీ చెప్పటం తెలిసిందే.
తాను చేసిన పనికి భానుశ్రీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. భానుశ్రీ చేసిన తప్పుతో ప్రేక్షకులు గట్టిగానే బుద్ధి చెప్పినట్లుగా భావిస్తున్నారు. ఎలిమినేషన్ ఎదుర్కొంటున్న ముగ్గురు కంటెస్టెంట్లకు కలిపి ఆరు కోట్లకు పైనే ఓట్లు వచ్చాయని.. వచ్చిన ఓట్లలో స్వల్పతేడాతో భానుశ్రీ ఎలిమినేట్ అయినట్లు నాని చెప్పాడు. చౌకబారు ఆరోపణలు చేయటం వల్లే భానుశ్రీ ఎలిమినేట్ అయ్యారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
తాజా పరిణామాలు చూస్తే.. హౌస్ మేట్స్ లో కౌశల్ అంతకంతకూ బలోపేతం అవుతున్న విషయం అర్థమవుతోంది. భానుశ్రీతో పాటు ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొన్న దీప్తి.. గణేశ్ లు ఈ వారానికి సేవ్ అయ్యారు. భానుశ్రీ బయటకు వెళుతుందన్న విషయం ప్రకటించిన వెంటనే బృంద సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
ఇక.. పిట్ట సునయన అయితే కన్నీళ్లు పెట్టేసుకుంది. ఆమె వెళుతుంటే.. బృంద సభ్యులు అప్లాజ్ ఇచ్చి పంపటం ఒక ఎత్తు అయితే.. బయటకు వెళ్లే డోర్ దగ్గర విజిల్ కొట్టి ఆకట్టుకుంది భానుశ్రీ. వెళుతూ.. వెళుతూ బిగ్ బాంబ్ టాస్క్ లో భాగంగా అమిత్ పై అమితమైన అభిమానాన్ని ప్రదర్శిస్తూ.. ఈ వారం మొత్తం కుర్చీలో కూర్చునేందుకు అతడ్ని నామినేట్ చేసి.. అమిత్ ఎక్కడికి వెళితే అక్కడికి కుర్చీని తీసుకెళ్లే గురుతర బాధ్యతను అతడికి అప్పజెప్పింది. మొత్తంగా తనకు కౌశల్ కు మధ్య టర్మ్స్ సరిగా లేవన్న విషయాన్ని తన బిగ్ బాంబ్ తో భానుశ్రీ మరోసారి స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.