టాలీవుడ్ లో బాల నటులకు కొదవ లేదు. బాలనటుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకొని.. మిస్టర్ అయ్యాక అవకాశాలు దక్కించుకొని తనకున్న ఇమేజ్ ను కంటిన్యూ చేసిన నటులు తక్కువమందే కనిపిస్తారు. ఒకప్పుడు చాలా సినిమాల్లో నటించిన భరత్ అలియాస్ చిట్టినాయుడు ఇప్పుడు మాస్టర్ కాస్తా మిస్టర్ అయ్యారు.
యూత్ లోకి వచ్చేసిన భరత్ ఇప్పుడు పూర్తిగా మారాడు. ఒకప్పుడు ముద్దుగా.. బొద్దుగా ఉండే అతగాడు ఇప్పుటు స్లిమ్ గా.. ఫిట్ గా అయిపోయాడు. అంత లావుగా ఉండే భరత్.. ఇప్పుడంత సన్నగా ఎలా అయ్యాడంటే.. దాని వెనుక చాలానే కష్టం ఉంది.
చిన్నతనంలో తిండి మీద ఉన్న ఇష్టం.. దానికి కంట్రోల్ లేకపోవటంతో అలా లావైపోయాడు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు డాక్టర్ల దగ్గరకు వెళ్లిన ప్రతిసారీ.. ఇంత లావా? తగ్గాలి కదా? అన్న మాటలు.. వయసుతో పాటు పెరిగిన అవగాహన కూడా భరత్ ఆలోచనల్ని మార్చేసింది. సినిమాల్ని అమితంగా ఇష్టపడే అతడు.. తనను తాను మార్చుకోవటానికి చాలానే కష్టపడ్డాడు.
లావు తగ్గేందుకు డాక్టర్లను కలిస్తే.. ఇష్టమైన పుడ్ కు దూరంగా ఉండాలని.. ఉడకపెట్టిన కూరగాయలు తినాలని.. రైస్ చాలా కొంచమే తినాలని చెప్పారు. మొదట్లో ఏంట్రా ఈ జీవితం.. ఇవి తినడానికేనా బతికేది అని ఫీలయ్యాడట. కానీ.. డైట్ మొయింటైన్ చేసిన తర్వాత బరువు తగ్గటం మొదలు కావటం.. ఇప్పుడు ఏకంగా 30 కేజీలు తగ్గేసి.. కొత్త లుక్ లోకి వచ్చేసినట్లు చెప్పాడు. క్రమపద్దతిలో తిండి తినటం.. వర్క్ వుట్స్ చేయటంతో బొద్దు భరత్ కాస్తా.. స్లిమ్ భరత్ అయ్యారు.