ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్బార్ చిత్రం పాజిటివ్ టాక్ ను దక్కించుకుని మంచి వసూళ్లను రాబట్టింది. దాదాపుగా 150 కోట్ల షేర్ ను ఈ చిత్రం రాబట్టింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. అయినా కూడా సినిమా బయ్యర్లు మాత్రం దారుణంగా నష్టపోయాం అంటూ రజినీకాంత్ ను వేడుకుంటున్నారు. తమకు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ దర్శకుడు భారతి రాజా దర్బార్ సినిమా మరియు రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
హీరోలు సినిమా వేడుకల్లో.. ఆడియో ఫంక్షన్స్ లో రాజకీయాలు మాట్లాడితే సినిమాలకు కష్టాలు తప్పవు. సినిమాకు వారి మాటలు నష్టంను చేకూర్చుతాయి. హీరోలు రాజకీయాల గురించి మాట్లాడటం వల్ల ఇండస్ట్రీ చాలా నష్టపోవాల్సి వస్తుంది. దర్బార్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో రజినీకాంత్ రాజకీయాలు మాట్లాడటం వల్ల సినిమా నష్టాలపాలయ్యిందంటూ భారతి రాజా అభిప్రాయపడ్డారు.
సినిమాకు 400 కోట్లు వసూళ్లు నమోదు అయ్యాయంటూ ప్రచారం చేస్తున్నారు. 50 కోట్ల సినిమాకు 400 కోట్లు అంటూ ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. 400 కోట్లు వచ్చి ఉంటే మిగిలిన 350 కోట్లు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించాడు. పెద్ద హీరోల సినిమాలను కొనుగోలు చేసే సమయంలో బయ్యర్లు కాస్త ఆలోచించి కొనాలని లేదంటే దర్బార్ బయ్యర్ల పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. సినిమా స్థాయిని మించి కొనుగోలు చేయడం వల్ల హిట్ అయినా లాభాలు రావంటూ భారతి రాజా అన్నారు.