గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో ఓ కొత్త లవ్ స్టోరీ చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ అమ్మాయి భారతీ మల్హోత్రాతో రణ్ బీర్ కపూర్ ప్రేమాయణం మొదలుపెట్టాడని.. రీసెంట్ వీరిద్దరూ మొరాకోలో చక్కర్లు కొట్టారనే వార్తలు కూడా హల్ చల్ చేశాయి. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది భారతి.
రణ్ బీర్ కపూర్ సోదరి రిధిమా.. భారతిని తన సోదరుడికి పరిచయం చేయగా.. ఆ పరిచయం ప్రేమాయణానికి దారి తీసిందన్నది ఈ వార్తల సారాంశం. మొదట వీటిని రూమర్లుగానే తీసుకున్నా.. వీటిపై టీవీల్లో కూడా స్పెషల్ షోస్ ప్రారంభమైపోవడంతో.. భారతికి నోరు విప్పక తప్పలేదు. 'అసలు నేను రణబీర్ కపూర్ తో పని చేసేందుకు ఇష్టపడతాను అని కూడా చెప్పలేదు. అతను ఓ మంచి యాక్టర్ అయితే కావచ్చు.. కనీసం అతన్ని నేను ఓ ఫ్యాన్ గా కూడా అభిమానించలేదు.' అని చెప్పింది భారతీ మల్హోత్రా.
అంతే కాదు.. అసలు రణ్ బీర్ సోదరి రిధిమాతో తనకు పరిచయం కూడా లేదని.. అలాంటిది ఆమెతో కలిసి పార్టీకి వెళ్లడం.. ఇద్దరం కలిసి పార్టీ చేసుకోవడం, రణ్ బీర్ కి పరిచయం చేయడం అన్నీ పుకార్లే అని తేల్చేసింది ఈ భామ. గతవారం రోజుల నుంచి తనకు ఈ విషయంపై ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయని.. మొదట ఎవరో జోక్ చేసి ఉంటారని అనుకున్నానని చెప్పిన భారతీ మల్హోత్రా.. తన ఫేస్ బుక్ ఎకౌంట్ లోని ఫోటోలను ఉపయోగించి ఈ రూమర్స్ క్రియేట్ చేసేశారని చెప్పింది.