మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు మాజీ డ్రైవర్ ఏదో ఆవేశంలో తన వాళ్లతో కలిసి భావన కారు ఎక్కి ఏడిపించాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాప్ అని అర్థమైంది. ఇప్పుడు ఈ కిడ్నాప్ వెనుక ఒక హీరో హస్తం ఉందని పోలీసుల విచారణలో వెల్లడవడం గమనార్హం. కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ అనే వ్యక్తికి ఆ హీరో రూ.30 లక్షలు ఇచ్చి ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక పొలిటీషియన్ కొడుకులిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం.
భావన కిడ్నాప్ కు ప్లాన్ చేసిన హీరోకు ఒకప్పుడు ఆమె మంచి ఫ్రెండేనట. ఆమె అతడి పెళ్లికి కూడా వెళ్లిందట. ఐతే అతను తన భార్య నుంచి విడిపోవడానికి భావనే కారణమైందట. ఆ హీరోకు.. అతడి భార్యకు విభేదాలు తలెత్తినపుడు భావనే అతడి వైపు నిలవకుండా భార్య వైపు మాట్లాడిందట. ఈ నేపథ్యంలో భావనకు.. ఆ హీరోకు విభేదాలు తలెత్తినట్లు సమాచారం. భావన మీద కక్ష పెంచుకున్న ఆ హీరో ఏకంగా ఆమెను కిడ్నాప్ చేసి ఏదో చేయాలని ప్లాన్ చేసే వరకు వెళ్లింది. పోలీసులు ప్రస్తుతం ఆ హీరోను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. కిడ్నాప్ లో పాల్గొన్న వారందరినీ మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ కేసు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని.. మీడియాకు వివరాలు అందజేస్తారని మలయాళ మీడియా అంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/