ఇటీవలే ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త పాలసీలో భాగంగా ఏ హీరో సినిమాకి ఎలాంటి అదనపు షోలు ఇవ్వబోమని...హీరోలంతా ఒక్కటేనని గట్టిగానే చెప్పారు. దీంతో వైకాపా ప్రభుత్వం ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు ఉండవని తేల్చేసారు. ఇంకా పలు అంశాలపై నియంత్ర తీసుకొచ్చారు. అయితే డిసెంబర్ 2న రిలీజ్ అయిన అఖండ విషయంలో నిబంధనలన్నీ తుంగలోకి తొక్కినట్లే కనిపిస్తోంది. ఏపీలో చాలాచోట్ల అఖండ బెనిఫిట్ షోలు పడ్డాయి. తిరుపతి సహా తెలుగు రాష్ట్రాలో బాలయ్య కు మెయిన్ మార్కెట్ ఏరియాల్లోనే అదనపు షోలు పడినట్లు టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి రిలీజ్ కి ముందు రోజు రాత్రి షోలు ఉంటాయని చాలా మంది భావించారు. కానీ ఒకానొక దశలో ఆ ఛాన్స్ ఎంత మాత్రం లేదని షోలు అన్ని క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని అంతే బలంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో యాథావిథిగా బెనిఫిట్ షోలు పడ్డాయి. స్థానికంగా ఎక్కడిక్కడ థియేటర్ యాజమాన్యాలు అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్ ప్రకారం షోలు వేయకూడదు. కానీ స్థానిక పాలనా యంత్రాంగం నుంచి అనుమతులు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. మరి దీని వెనుక అసలు రాజకీయం ఏంటో ముందు ముందు తేలనుందని గుసగుస మొదలైంది.
త్వరలో `పుష్ప`..`ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ అవుతున్నాయి. ఆ తర్వాత జనసేన అధినేత నటిస్తోన్న `భీమ్లానాయక్` రిలీజ్ అవుతుంది. మొదటి రెండు సినిమాలు వదిలేసి మూడవ సినిమాని పట్టుకుంటే గనుక పవన్ పొలిటికల్ గా గట్టిగానే లాక్ అవుతారు. అదే జరిగితే పవన్ సినిమాకి వసూళ్లు ఘోరంగా పడిపోతాయి. ఆ తర్వాత నిర్మాతలు పవన్ తో సినిమాలు చేయడానికి ముందుకు రారు. మార్కెట్ పడిపోతుంది. ఆర్ధికంగా గట్టి దెబ్బ తగులుతుంది. సినిమాలు మానేసి రాజకీయాలు మాత్రమే చేస్తానని చెప్పిన పవన్ అటుపై బ్యాక్ టూ పెవిలియన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలంటూ వైకాపా ఇలా గేమ్ ప్లాన్ చేసిందా? అంటూ ఒక సెక్షన్ లో గుసగుస వేడెక్కిస్తోంది. `అఖండ-పుష్ప-ఆర్.ఆర్.ఆర్` లను వదిలేసి భీమ్లాను ఇరుకున పెడతారా? అన్నదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.