అమెరికాలో ప‌వ‌ర్ స్టామినా..ఫ్యాన్స్ దిల్ ఖుష్‌!

Update: 2022-03-02 07:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `భీమ్లా నాయ‌క్` బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో టిక్కెట్ ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నా ప‌వ‌న్ స్టామినా ముందు అన్ని కొట్టుకుపోతున్నాయి. వ‌సూళ్ల ప‌రంగా నాయ‌క్ దూకుడుని ఇప్ప‌ట్లో ఆప‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు.

ఇక ఓవ‌ర్సీస్ లోనూ నాయ‌క్  వేగం జెట్ స్పీడ్ తోనే కొనసాగుతోంది. అమెరికాలో ప‌వ‌న్  క‌ళ్యాణ్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాస‌ర్  తెచ్చిన చిత్రంగా `భీమ్లా నాయ‌క్` నిలిచింది. మంగ‌ళ‌వారం నాటికి $ 2.22 మిలియ‌న్ల‌కు చేరుకుంది. మంగ‌ళ‌వారం నాటి క‌లెక్షన్ల‌తో పొల్చితే `భీమ్లా నాయ‌క్`` ప‌వ‌న్ కెరీర్ లోనే హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ గా నిలిచింది.

దీంతో ఓవ‌ర్సీస్ పంపిణీదారులంతా బాగా లాభ‌ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. అమెరికాలో ఫుల్ ర‌న్ లో $2.5 మిలియ‌న్ మార్క్ ని చేరుకుంటుంద‌ని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే నాయ‌క్ అక్క‌డ భారీగానే ఓపెనింగ్స్ సాధించినా సోమ‌వారం నాటికి వ‌సూళ్లు మంద‌గించాయి. సోమ‌వారం కేవ‌లం $ 40 కె వ‌సూళ్లు మాత్ర‌మే తేగ‌లిగింది.  మంగ‌ళ‌వారం మ‌ళ్లీ కాస్త పుంజుకున్న‌ట్లు క‌నిపించింది. అయితే అమెరికాలో తొలి సోమ‌వారం లెక్క ఒక‌టుంది.

తొలి సోమ‌వారం  క‌లెక్ష‌న్ల రికార్డుల విష‌యానికి వ‌స్తే ప్ర‌భాస్ న‌టించిన `సాహో`నే ఇప్ప‌టికీ  ముందంజ‌లో ఉంది. ఈ యాక్ష‌న్ డ్రామా $ 254 కే సాధించింది. ఇది ఇప్ప‌టికీ ఓ రికార్డు. దీన్ని బ్రేక్ చేయ‌గ‌లిగే స‌త్తా కేవ‌లం `ఆర్ ఆర్ ఆర్` కి మాత్ర‌మే  ఉంద‌ని అంచ‌నాలున్నాయి. `భీమ్లా నాయ‌క్` 40 కె..`స‌రిలేరు నీకెవ్వ‌రు` స‌హా ఇత‌ర చిత్రాలు $50 కె లోపే వ‌సూళ్ల‌ను సాధించాయి. వాస్త‌వానికి `సాహో` ఫ‌స్ట్ షో తోనే నెగిటివ్  టాక్ తెచ్చుకున్నా సోమ‌వారం వ‌సూళ్లు బాగున్నాయి.

కానీ ప‌వ‌న్ ..మ‌హేష్ సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్నా పాన్ ఇండియా స్టార్ వేగాన్ని మాత్రం అందుకోలేక‌పోయారు. ఆ ర‌కంగా  మొద‌టి సోమ‌వారం నాటి లెక్క‌లు మ‌రోసారి ప్ర‌భాస్ పాపులారిటీని గుర్తుచేసాయి.  `భీమ్లా నాయ‌క్` ఇప్ప‌టివ‌ర‌కూ అమెరికాలో $ 2,054,680 వ‌సూళ్లు సాధించ‌డంతో పవ‌న్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ప‌వ‌న్ కెరీర్ లోనే  అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్ల  చిత్రంగా నిల‌వ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కి `అత్తారింటికి దారేది` త‌ర్వాత స‌రైన స‌క్సెస్ లేదు. `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్`..` కాట‌మ రాయుడు `..`అజ్ఞాత‌వాసి` ..`వ‌కీల్ సాబ్` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమాల‌కు బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌తికూల వాతావ‌ర‌ణ‌మే ఏర్ప‌డింది. దీంతో ప‌వ‌న్ కి చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన స‌క్సెస్ గా నాయ‌క్ ని చెప్పొచ్చు. దీంతో ప‌వ‌న అభిమానుల ఖుషీ అవుతున్నారు.
Tags:    

Similar News