భూమిక.. ఆంటీ క్యారెక్టర్ల కు ఓకే

Update: 2015-08-11 10:14 GMT
సింహాద్రి, ఖుషీ, అనసూయ ఇలాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించింది భూమిక. ఓ ఐదేళ్ల పాటు పరిశ్రమలో టాప్‌ పొజిషన్‌ లోనే కొనసాగింది. అనూహ్యంగా భరత్‌ ఠాకూర్‌ ని పెళ్లాడి సినిమాలకు దూరమైంది. కాలక్రమంలో వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో దెబ్బ తిని కాస్త సెలబ్రిటీ ప్రపంచానికి దూరంగానే కాలం వెల్లదీస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌ లో నివాసం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇంతకాలం సైలెంటుగా దుబాయ్‌ లోనే ఉంటున్న భూమిక చడీచప్పుడు కాకుండానే దక్షిణాది సినిమాల్లో ప్రయత్నిస్తూనే ఉంది.

మలయాళం, కన్నడలోనూ కొన్ని అవకాశాలు వెతుక్కుంది. అయినా సెకండ్‌ ఇన్నింగ్స్‌ సజావుగా సాగలేదు. అందుకే ఇప్పుడు క్యారెక్టర్‌ నటిగా స్థిరపడాలని, కెరీర్‌ పరంగా యూటర్న్‌ తీసుకుందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో నదియా - సింధు తులానీ - రమ్యకృష్ణ వంటి స్టార్లు పునర్‌ వైభవంతో వెలిగిపోతున్నారు. అదే తీరుగా తాను కూడా వెలిగిపోవాలని భూమిక తపిస్తోందని సమాచారం. మన దర్శకనిర్మాతలు అవకాశాలివ్వాలే కానీ ఆంటీ పాత్రలకు సిద్ధమేనని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ - పూరి - వినాయక్‌ - సురేందర్‌ రెడ్డి .. వింటున్నారా గురూ?
Tags:    

Similar News