వోగ్ 2019: భూమివా.. సాగ‌ర‌క‌న్య‌వా?

Update: 2019-09-26 10:13 GMT
భూమి ఫెడ్నేక‌ర్ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. బాలీవుడ్ లో ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించిన ఈ అమ్మ‌డికి యువ‌త‌రంలో అద్భుత ఫాలోయింగ్ ఉంది. తాజాగా లేటు వ‌య‌సు షూట‌ర్ దాదీస్‌ చంద్రో తోమ‌ర్ (87) - ప్ర‌కాషి తోమ‌ర్ (82) రియ‌ల్ లైఫ్ క‌థ‌లో తాప్సీ తో పాటు భూమి ఫెడ్నేక‌ర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `సాంద్ కి ఆంఖ్` అనేది ఈ సినిమా టైటిల్. తుషార్ హిరానందాని ద‌ర్శ‌కుడు. అనురాగ్ క‌శ్య‌ప్ నిర్మాత‌. 50ల‌లో షార్ప్ షూట‌ర్స్ గా స‌త్తా చాటిన సిస్ట‌ర్స్ క‌థ‌తో ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది.
దీపావ‌ళికి ఈ సినిమాని రిలీజ్ కానుంది.

ఈ చిత్రంలో భూమి-తాప్సీ లుక్ ఇటీవ‌లే రిలీజైంది. తాజా టీజ‌ర్ లోనూ భూమి ఓల్డ్ గెట‌ప్ ఆక‌ట్టుకుంది. ఇక‌పోతే భూమి ఫెడ్నేక‌ర్ నిన్న సాయంత్రం దిల్లీలో జ‌రిగిన వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2019 వేడుక‌ల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ భామ రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో వేదిక‌ను వేడెక్కించింది. అక్క‌డ భామ‌లంద‌రిలోనూ ఎంతో స్పెష‌ల్ గా క‌నిపించింది. దేవ‌తాసుంద‌రిని త‌ల‌పించే డిఫ‌రెంట్ డిజైన‌ర్ డ్రెస్ లో క‌నిపించి మైమ‌రిపించింది. ఒక ర‌కంగా సాగ‌రం(స‌ముద్రం) నుంచి ఊడిప‌డిన మ‌త్స్య‌క‌న్య‌నే త‌ల‌పిస్తోంది క‌దూ?

భూమి ఫెడ్నేక‌ర్ డిజైన్ చూశాక‌.. నెటిజ‌నుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ యూత్ ప‌రేషాన్ అవుతుంటే.. అస‌లు నువ్వు భూమివా.. సాగ‌ర‌క‌న్య‌వా? అంటూ కొంద‌రు కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. జియాన‌ఖద్ జువెల‌రీ వాళ్లు ఔట్ ఫిట్ ని డిజైన్ చేశారు. భూమికి ప్ర‌ణీత అభి స్టైలింగ్ చేశాడు. ప్ర‌గ్య నౌథియాల్ అసిస్టెంట్ గా సాయం చేశార‌ట‌. క్లోవ‌ర్ వూట‌న్ మేక‌ప్ సాయం వ‌ర్క‌వుటైంది. షెహ‌న‌న్ త‌న్వానీ ఈ డిజైన‌ర్ లుక్ కి సోర్స్ అందించారట‌.


Tags:    

Similar News