బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఓ సినిమా కోసం లావుగా మారినా.. మరో సినిమా కోసం బామ్మగా కనిపించినా భూమికే చెల్లింది. తన యాక్టింగ్ తోనే కాకుండా గ్లామర్ పరంగానూ ప్రేక్షకులను అలరిస్తోంది. బొద్దుగుమ్మగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తన కత్తిలాంటి ఫిగర్ తో ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. 'దమ్ లాగా కే హైసా' చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన భూమి.. ఈ సినిమాలో చాలా లావుగా కనిపించింది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో 'టాయ్ లెట్' 'సుభ్ మంగల్ సావధన్' 'లస్ట్ స్టోరీస్' 'సోంచరియా' 'సాండ్ కీ ఆంఖ్' 'బాలా' 'పతి పత్ని ఔర్ వాహ్' 'భూత్' 'డాలీ కిట్టి ఔర్ వాహ్ చమక్త్ సితారే' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం భూమి పడ్నేకర్ 'దుర్గావతి' అనే చిత్రంలో నటిస్తోంది. ఇది తెలుగులో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'భాగమతి' కి రీమేక్. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అశోక్ హిందీ వర్షన్ కి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ - బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ - విక్రమ్ మల్హోత్రా నిర్మించారు. టైటిల్ రోల్ ప్లే చేస్తున్న భూమి.. 'దుర్గావతి'గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోందని బీ టౌన్ లో చర్చించుకుంటున్నారు. దీని కోసం అనుష్క పాత్రను యాజ్ టీజ్ గా ఇమిటేట్ చేసిందట. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే 'భాగమతి' రీమేక్ లో నటిస్తూ తెలుగు ఫిలిం మేకర్స్ దృష్టిలో పడాలని భూమి అనుకుంటోందట. మరి తెలుగు మార్కెట్ లోకి రావాలని ట్రై చేస్తున్న భూమికి ఇక్కడ కూడా అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.