బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పెడ్నేకర్ కెరీర్ మూడేళ్లుగా ఫుల్ స్వింగ్ లో ఉంది. తాను ఏది చేపట్టినా అది సక్సెసవుతోంది. మీడియం బడ్జెట్ సినిమాలతోనే బోలెంత పాపులరైంది. తను నటించిన సినిమాలు ఏడాదికి నాలుగైదైనా రిలీజ్ అవుతున్నాయి. వాటి సక్సెస్ శాతం మెరుగుపడడంతో నటిగా మాత్రం బిజీ అయ్యింది. నటిగా ప్రశంసలు అందుకుంటూ జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలతో ముందుకెళ్లిపోతుంది. ప్రస్తుతం అమ్మడి క్యాలెండర్ తిరగేస్తే అరడజనకు పైగానే సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో మూడు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఇందులో చెప్పుకోదగ్గ చిత్రం `బదాయి దో`.
మూడేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ అయిన `బదాయ్ హో` చిత్రానికి సీక్వెల్ ఇది. దీంతో `బదాయి దో` పై అంచనాలు బాగానే ఉన్నాయి. రాజ్ కుమార్ -భూమీ పెడ్నేకర్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే అంచాల్ని పెంచేస్తున్నాయి. పైగా బాలీవుడ్ లో సీక్వెల్స్ ఫెయిలైన సందర్భాలు చాలా తక్కువ. దాదాపు ప్రతీ సీక్వెల్ కూడా బ్లాక్ బస్లర్ అయింది. ఆ సెంటిమెంట్ `బదాయ్ దో` కి కూడా కలిసొస్తుందనే నమ్మకం రెట్టింపు అయింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా ఉంది. `బంటీ ఔర్ బబ్లీ-2`.. `సత్యమేవ జయతే-2`..`భూల్ భూలయ్య-2` సీక్వెల్స్ పై కూడా భారీ అంచనాలున్నాయి.
వీటిలో భారీ వసూళ్లు సాధించే సీక్వెల్ గా ఏది నిలుస్తుందంటూ బాలీవుడ్ లో పెద్ద ఎత్తున పందాలు కూడా నడుస్తున్నాయి. ఆ సంగతి పక్కనబెడితే భూమీ పడ్నేకర్ లెహంగా లుక్ ఒకటి ఇన్ స్టాలో వైరల్ గా మారింది. డిజైనర్ లెహంగాలో భూమి చిరునవ్వులు చిందిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఇక మత్తెక్కించే అందాల ఎరతో మతులు చెడగొడుతోంది ఒకరకంగా.