బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ పై నటి భూమిక చావ్లా తీవ్ర దిగ్బ్రాంతికి గురై భావోద్వేగమైన లేఖ రాసింది. గత నెల 14న సుశాంత్ సింగ్ ఆత్మహత్య గురించి భూమిక రెండోసారి లేఖ రూపంలో స్పందించింది. ఈ లేఖలో ఎంతో విషాదంతో కూడిన విషయాలు పేర్కొంది. "జీవితంలో గెలుపు ఓటములు ఓ భాగం మాత్రమే.. అంత మాత్రాన లైఫ్‌ను అర్ధాంతరంగా ముగించడం భావ్యం కాదు. సుశాంత్ నీవు ఈ లోకాన్ని వీడి ఇప్పటికి 20 రోజులు. నువ్ లేవనే బాధతో ప్రతీరోజు నిద్రలేస్తున్నా. నీతో నాకు ఉన్న అనుబంధం చాలా తక్కువే. ఎంఎస్ ధోని చిత్రంలో నీతో కలిసి కొద్ది రోజులే నటించాను. కానీ నీతో ఏర్పడిన అనుబంధాన్ని తెంచుకోలేకపోతున్నాను" అంటూ భూమిక ఎమోషనల్ అయింది.
"అవకాశాలు చేజారితే దానికి సరిపోననే మనసుకు సర్ధి చెప్పుకొంటే ఆ బాధ తగ్గుతుంది. పాజిటివ్‌గా ఉండే నీవు ఇలాంటి నిర్ణయం తీసుకొంటావని ఊహించలేదన్నారు. నువ్ ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకొనే ముందు దానికి కారణం డిప్రెషనా? లేదా వ్యక్తిగత కారణాలా? అనే విషయాన్ని కనీసం చెప్పి ఉంటే మాకు నీ బాధ అర్ధం అయ్యేది. ఒకవేళ నీ డిప్రెషన్ కారణం ప్రొఫెషనల్ విషయాలు అయితే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే నువ్వు ఎన్నో విజయాలను చవిచూశావు. ఇక్కడ బతకడం అంత ఈజీ కాదనే విషయం నాకు కూడా తెలుసు" అని భూమిక తన లేఖలో పేర్కొంది. ఇంకా ఇండస్ట్రీ చెందామా లేదా అనేది అటుంచితే.. నేను 50 సినిమాలు చేసిన తర్వాత కూడా అవకాశాల కోసం ఎవరినో ఒకరిని సంప్రదిస్తూనే ఉన్నాను. ఇండస్ట్రీలో ఆఫర్లు చేజిక్కించుకోవడమనేది అంత సులభం కాదనే విషయం విదితమే.
అయినా నాకు ఇప్పటికీ ఏదో ఒక అవకాశం వస్తూనే ఉంది. ఏదో మంచి జరుగుతుందనే భావనతో ముందుకు వెళ్లడం తప్ప మరోటి లేదు. సినీ జీవితాన్ని గొప్పగా ఆశించి వచ్చే మనలాంటి వాళ్లకు ముంబై నగరం మన స్వప్నాలను నింపుతుంది. పేరు ప్రఖ్యాతులు ఇస్తుంది. కొన్నిసార్లు మనల్ని అనామకులుగా మారుస్తుంది. లక్షలాది మంది కోరికల దాహాన్ని కూడా ఏదో రూపంలో తీర్చుతుంది. చివరకు సాధ్యపడదనే నిర్ణయించుకొన్న తర్వాతే జీవితంపై ఆశలు వదులుకోవాలి. నీకు ఆ పరిస్థితి లేదుగా.. మరి ఎందుకు ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నావనే ఒక్క మాట చెబితే బాగుండు" అని భూమిక తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇది చదివిన ప్రతీ నెటిజన్ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నారు.