మెగాస్టార్ 50 ఏళ్ల న‌ట‌జీవితం

Update: 2019-02-15 07:24 GMT
ఒక్క అడుగుతో మొద‌లై.. ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా ఎదిగారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్. ఉత్త‌రాది సినీప‌రిశ్ర‌మ‌లో స్వ‌యం కృషితో ఎదిగిన ఏకైక పెహ‌న్ షా. 20 వ‌య‌సులో ఎంత జోయ్ ఫుల్ గా ఉన్నారో 60 వ‌య‌సు దాటాక కూడా అంతే జోరుగా సినిమాలు చేస్తూ ఆ జోయ్ ని త‌న జీవితంలో ఒక భాగం చేశారు. స్మాల్ బి అభిషేక్ కి లేని క్రేజు బిగ్ బికి ఇప్ప‌టికీ ఉంది అంటే అర్థం చేసుకోవ‌చ్చు. అత‌డు బాద్ షాల‌కే బాద్ షా. ఎంద‌రో స్టార్ల పుట్టుక‌కు కార‌కుడు. వేలాది మంది ఉపాధికి బాట‌లు వేసిన ఒక బాట‌సారి. ఇన్నేళ్ల‌లో అత‌డు సాధించ‌ని ఎత్తులు లేవు. అందుకోని శిఖ‌రాలు లేవు.

సౌత్ పైనా ఆయ‌న ప్ర‌భావం అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి, ర‌జ‌నీకాంత్, ర‌వితేజ వంటి అగ్ర హీరోల‌కు బిగ్ బి అమితాబ్ స్ఫూర్తి. ఆయ‌న ఎదుగుద‌ల.. ఆయ‌న బ‌యోగ్ర‌ఫీ ఒక స్ఫూర్తివంత‌మైన పాఠంగా భావిస్తారు అంతా. ఎంద‌రో న‌వ‌త‌రం హీరోలు అమితాబ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొందామ‌ని బ‌హిరంగంగా చెబుతుంటారు. ఇక‌ అయిపోయాడు అనుకున్న బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ `కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి` అనే బుల్లితెర కార్య‌క్ర‌మంతో బౌన్స్ బ్యాక్ అయిన తీరు, ఆ త‌ర్వాత బాలీవుడ్ ని య‌థాత‌థంగా మునుప‌టి క‌రిష్మాతో ఏలిన రాజ‌సం ప్ర‌తిదీ స్ఫూర్తివంత‌మే. అందుకే నేటితో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ సినీకెరీర్ 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది అన‌గానే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి ఉద్వేగం వెల్లువెత్తుతోంది. శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఆయ‌న అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

ఈ సంద‌ర్భంగా స్మాల్ బి అభిషేక్ బ‌చ్చ‌న్ సామాజిక మాధ్య‌మాల్లో ఓ ఫోటోని పోస్ట్ చేసి ఎంతో ఉద్వేగానికి లోన‌య్యారు. త‌న తండ్రి అమితాబ్ గురించి ప్ర‌స్థావిస్తూ.. ఆయ‌న నాన్న‌గారే కాదు.. అంత‌కుమించి నా బెస్ట్ ఫ్రెండ్.. మార్గ ద‌ర్శ‌కుడు.. బెస్ట్ క్రిటిక్.. ఐడ‌ల్.. గొప్ప స‌పోర్ట్.. హీరో! అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికీ ఆయ‌న ఒక‌టో సినిమాకి ప‌ని చేసిన‌ట్టే ప‌ని చేస్తున్నారు. సినిమా అంటే ఆయ‌న‌కు అంత ఇష్టం అని తెలిపారు. ``డియ‌ర్ పా.. ఈరోజు మీ ప్ర‌తిభ‌ను.. మీ ప్యాష‌న్ ని.. మీ మేధోత‌నాన్ని .. మీ ఉన్న‌త‌మైన‌ ప్ర‌భావాన్ని మేం సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం. మ‌రో 50 ఏళ్ల పాటు మీలోని శ‌క్తి యుక్తులు ఎలా ఉన్నాయో చూడాల‌ని ఉత్కంఠగా ఉన్నాం. 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న్ని విష్ చేయ‌డానికి వెళితే.. నేను నా ప‌నిలో వెళుతున్నా! అంటూ శ‌క్తిని ప్ర‌ద‌ర్శించారు`` అని సుదీర్ఘంగా హృద‌యాన్ని ట‌చ్ చేసే లేఖ‌ను అభిషేక్ అభిమానుల‌కు షేర్ చేశారు. 50 ఏళ్ల క్రితం ఒక గొప్ప న‌టుడు బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌య్యారు. నేటికీ ఆయ‌న రంజింప జేస్తూనే ఉన్నారు. జంజీర్, స‌త్తే పే స‌త్తా, సుహాగ్, ఆనంద్, చుప్కే చుప్కే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో ఆరంభ‌మై పెద్ద స్టార్ అయ్యారు.
Tags:    

Similar News