బిగ్‌బాస్‌5 : ఆ ముగ్గురిలో ఒకరు ఈవారం ఔట్‌

Update: 2021-11-16 07:44 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకం కు చేరింది. కొన్ని వారాలే మిగిలి ఉన్న ఈ నేపథ్యంలో ప్రతి వారం కూడా ఎలిమినేషన్‌ పక్రియ చాలా ఆసక్తికరంగా సాగతుంది. గత వారం కాజల్‌ ఎలిమినేట్ అయినట్లే అనుకుంటూ ఉండగా జెస్సీ ఆరోగ్యం బాగాలేక పోవడం వల్ల ఆమె సేఫ్‌ అయ్యింది. జెస్సీ బయటకు వెళ్లి పోవడం వల్లే ఖచ్చితంగా కాజల్‌ సేవ్‌ అయ్యింది అనేది బిగ్ బాస్ విశ్లేషకుల మాట. ఇక గత వారం ఎలిమినేషన్ నుండి కంటెస్టెంట్స్ తప్పించుకున్నా ఈ వారం మాత్రం ఒకరికి ఎలిమినేషన్‌ తప్పదు. ఆ ఒక్కరు ఎవరు అనేది చర్చనీయాంశంగా ఉంది. ఈ వారం యాంకర్ రవి కెప్టెన్‌ అయిన కారణంగా ఆయన ఎలిమినేషన్ నుండి సేఫ్‌ అయ్యాడు. వరుసగా ఎనిమిది తొమ్మిది వారాలు నామినేట్‌ అయ్యి సేవ్‌ అయిన రవి ఎట్టకేలకు కెప్టెన్ అవ్వడం వల్ల నామినేషన్‌ లో లేడు.

ఇక ఈ వారం నామినేషన్ లో షన్నూ.. కాజల్.. మానస్‌.. సిరి.. ప్రియాంక.. సన్నీ.. ఆనీ.. శ్రీరామ చంద్రలు ఉన్నారు. రవి కాకుండా మొత్తం ఇంటి సభ్యులు అంతా కూడా నామినేట్ అవ్వడం తో ఆసక్తి నెలకొంది. గత వారం నామినేషన్ లో లేకుండా ప్రియాంక మరియు ఆనీలు సేవ్‌ అయ్యారు. వీరిద్దరిలో ఎవరైనా నామినేషన్‌ లో ఉండి ఉంటే డేంజర్ జోన్ లో ఉండేవారు అనేది టాక్. ఇక ఈవారం డేంజర్ జోన్‌ లో కాజల్‌.. ఆనీ మరియు ప్రియాంకలు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు ఓట్ల పరంగా కాస్త తక్కువ దక్కించుకుంటున్నారట. ఇంతకు ముందు ఓట్ల శాతం చూస్తే ఈ వారంలో వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ఆనీ మాస్టర్ ను ఈ వారం బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఆనీ మాస్టర్ రెండు మూడు వారాల క్రితమే ఎలిమినేట్‌ అవ్వాల్సినా కూడా ఆమెకు స్పెషల్‌ పవర్‌.. కెప్టెన్సీ.. ఇమ్యూనిటీ దక్కిందని.. ఈసారి మాత్రం ఆమె ఖచ్చితంగా ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అంటూ బుల్లి తెర విశ్లేషకులు అంటున్నారు. ఆమె ఒక వేళ లక్కీగా సేవ్‌ అయితే ప్రియాంక లేదా కాజల్‌ లో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్‌ అవ్వడం పక్కా అంటున్నారు. మొత్తంగా కాజల్‌.. ఆనీ మరియు ప్రియాంకల్లో ఒకరు ఈ వారం ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం. కాజల్‌ ను కొందరు టార్గెట్ చేసి గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తుంటే.. ఆనీ మాత్రం పదే పదే కాజల్‌ ను టార్గెట్‌ చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.

ఇక ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మానస్ మానస్ అంటూ అతడి చుట్టే తిరుగుతోంది. ఈమద్య ప్రియాంక కాస్త డల్ అయ్యింది. దాంతో ఆమె ఇలా డేంజర్ జోన్ లోకి వచ్చి నిల్చింది. శుక్రవారం వరకు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు డేంజర్ జోన్‌ లో ఉన్న వారు ఏదైనా సంఘటనతో అనూహ్యంగా సేఫ్‌ జోన్‌ లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. అందుకే ఆదివారం ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యే వరకు ఎవరు ఎలిమినేట్‌ అవుతారో వెయిట్‌ చేయాల్సిందే.
Tags:    

Similar News