దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే.. రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా.. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా సోకిందని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారని ఆయన ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన రెండు, మూడు రోజుల్లో అమీర్ ను కలిసిన వారు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.
కాగా.. బాలీవుడ్లో గడిచిన వారం రోజుల్లోనే చాలా మంది కొవిడ్ బారిన పడ్డారు. నటులు రణ్ బీర్ కపూర్, కౌశిక్ తోపాటు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, మనోజ్ బాజ్ పేయి, సిద్దాంత్ చతుర్వేదికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ జరిగింది. దీంతో.. వీరితో గడిపిన వారి పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగి, తగ్గినప్పటికీ.. ముంబైలో మాత్రం మొదటి నుంచీ తీవ్రంగానే ఉంది పరిస్థితి. దీంతో.. అధికారులు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. సెలబ్రిటీలను కూడా వదలకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు.
ముంబైలో కొవిడ్ తీవ్రతపై ఆందోళన వ్యక్తంచేసిన సీఎం ఉద్ధవ్.. ప్రజలకు సూచనలతో కూడిన హెచ్చరికలు జారీచేశారు. నిబంధనలు పాటించకపోతే మరోసారి కఠిన లాక్ డౌన్ విధిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండడం గమనార్హం.