యంగ్ హీరో నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో మంచి సక్సెస్ ను దక్కించుకున్నాడు. గత ఏడాది విడుదల అయిన అతి కొద్ది సినిమాల్లో భీష్మ నిలవడంతో పాటు.. గత ఏడాది టాప్ చిత్రాల జాబితాలో కూడా భీష్మ నిలిచింది. భీష్మ సినిమా సక్సెస్ తర్వాత ఈ ఏడాది నితిన్ ఇప్పటికే చెక్ మరియు రంగ్ దే సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. గత ఏడాది నుండి ఎంతో మంది స్టార్స్ ఇప్పటి వరకు తమ సినిమాలను విడుదల చేయలేక పోయారు. కాని నితిన్ మాత్రం మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మాస్ట్రో సినిమాతో కూడా రెడీ అయ్యాడు. ఇంత బిజీగా ఉన్న యంగ్ స్టార్ నితిన్ చెక్ సినిమా తో నిరాశ పర్చాడు. చెక్ సినిమా థియేటర్ లో ఆశించినట్లుగా ఫలితం దక్కించుకోలేక పోయింది. రంగ్ దే మాత్రం పర్వాలేదు అనిపించింది.
నితిన్ చెక్ సినిమా విషయంలో థియేటర్ల పరంగా నిరాశ పర్చినా కూడా బుల్లి తెరపై టెలికాస్ట్ అయ్యి మంచి రేటింగ్ ను దక్కించుకుంది. ఆశ్చర్యకర విషయం ఏంటీ అంటే ఈ సినిమాను రంగ్ దే మరియు భీష్మల కంటే కూడా అధికంగా బుల్లి తెరపై చూశారట. చెక్ సినిమా ను థియేటర్ల లో జనాలు ఎక్కువగా చూడలేదు. దానికి తోడు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కాస్త ఆలస్యంగా రావడంతో పాటు పెద్దగా తెలుగు ఖాతాదారులు లేని ఓ ఓటీటీ ప్లాట్ పామ్ పై వచ్చింది. అందువల్ల చెక్ సినిమాను బుల్లి తెరపై ఎక్కువ మంది చూశారంటూ విశ్లేషకులు అభిప్రాం వ్యక్తం చేస్తున్నారు.
నితిన్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఈ సినిమా కు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. షూటింగ్ ను తక్కువ సయంలో పూర్తి చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఉరి శిక్ష పడ్డ ఖైదీ చెస్ నేర్చుకుని ఆడే ఆట.. శిక్షను తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంను ఈ సినిమాలో చూపించారు. విభిన్నంగా ఉన్నప్పటికి కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో నిరాశ పర్చడం వల్ల థియేటర్లలో నిరాశ పర్చింది.. కాని బుల్లి తెరపై మాత్రం ఆకట్టుకుంది.