ప‌వ‌న్ సినిమా ఆడియో రైట్స్‌కి భారీ ఆఫ‌ర్‌

Update: 2022-01-12 15:45 GMT
`బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో చాలా వ‌ర‌కు నిర్మాణ సంస్థ‌ల‌తో పాటు ప్ర‌ముఖ ఉత్త‌రాది కంప‌నీలు టాలీవుడ్ సినిమా వ‌చ్చేస్తోందంటే హిందీ రైట్స్ తో పాటు ఆడియో రైట్స్ కోసం పోటీప‌డుతున్నారు. బాలీవుడ్ ఫేమ‌స్ ఆడియో కంప‌నీ సారేగామ ఇటీవ‌ల నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `శ్యామ్ సింగ రాయ్‌` ఆడియో హ‌క్కుల్ని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఇదే త‌ర‌హాలో మ‌రో బాలీవుడ్ కంప‌నీ టీ సిరీస్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చిత్రాల ఆడియో రైట్స్ ని భారీ మొత్తానికి ద‌క్కించుకుంది. రెండు మూడు చిత్రాల‌కు భాగ‌స్వామిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదిలా వుంటే ఈ రెండు ఆడియో కంప‌నీల త‌రువాత బాలీవుడ్ కి చెందిన పాపుల‌ర్ ఆడియో సంస్థ టిప్స్ కూడా తెలుగు సినిమా కోసం రంగంలోకి దిగింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` ఆడియో గ్లోబ‌ల్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ కి ద‌క్కించుకుంది.

అంతే కాకుండా మ‌రో క్రేజీ మూవీ `శాకుంత‌లం` ఆడియో హ‌క్కుల్ని కూడా ఇదే సంస్థ భారీ ఆఫ‌ర్ ఇచ్చి ద‌క్కించుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు చిత్రాలు పిరియాడిక్ నేప‌థ్యంలో రూపొందుతున్న మూవీస్ కావ‌డం గ‌మ‌నార్హం. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రానికి ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

స‌మంత టైటిల్ పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `శాకుంత‌లం`కు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా టిప్స్ అధినేత కుమార్ తౌరాణీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అంత‌టా ఎన్నో అద్భుత‌మైన పాట‌ల్ని, సంగీతాన్ని అందించింది టిప్స్ మ్యూజిక్.

అదే సంప్ర‌దాయాన్ని కోన‌సాగిస్తూ అదే నిబ‌ద్ధత‌తో తెలుగు సినీ రంగంలోకి ప్ర‌వేశించింది. ఇక‌పై తెలుగు చిత్రాల ఆడియో హ‌క్కులతో పాటు భార‌తీయ భాష‌లకు సంబంధించిన ఆడియో హ‌క్కుల్ని కొన‌డానికి సిద్ధంగా వుంది. కేవ‌లం భారీ చిత్రాలే కాకుండా చిన్న చిత్రాల ఆడియోల‌ని కూడా మా సంస్థ విడుద‌ల చేస్తుంది అని స్పష్టం చేశారు.
Tags:    

Similar News