దగ్గుబాటి హీరోలు ఎప్పటి నుంచో ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. గతంలోనే నిర్మాత సురేష్ బాబు ప్రముఖ దర్శకులతో కూడా చర్చలు జరిపారు. ఎలాగైనా తన తమ్ముడు వెంకటేష్ ను అలాగే కొడుకు రానా దగ్గుబాటిని వెండితెరపై అద్భుతంగా ప్రజెంట్ చేయాలి అని అనుకున్నారు. కానీ సరైన స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో సురేష్ బాబు ఎక్కువగా ఆలోచించలేకపోయారు.
అయితే రానా దగ్గుపాటి సలహా మేరకు వెబ్ సిరీస్ ద్వారా వీరిద్దరూ కలిసి నటిస్తూ ఉండడం విశేషం. అమెరికన్ క్రైమ్ డ్రామా రే డొనోవన్ ఆధారంగా తెలుగు నేటి వీటికి తగ్గట్టుగా నిర్మించిన రాణానాయుడు వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి.
మొదటిసారి వెంకటేష్ తో పాటు రానా కూడా వెబ్ సిరీస్లో నటిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీరిస్ విడుదల ఎప్పుడు అవుతుంది అనే విషయంలో అనే రకాల రూమర్స్ వైరల్ అవుతున్న సమయంలో చిత్ర యూనిట్ ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇక ఈ దీపావళికి ఈ వెబ్ సిరీస్ ను గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే రెగ్యులర్ గా కాకుండా ఒక పెద్ద సినిమా ఎలాగైతే రిలీజ్ అవుతుందో అదే తరహాలో ప్రమోషన్స్ చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఎందుకంటే ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ అలాగే మరికొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో బలమైన కంటెంట్ ఉన్న సిరీస్ లో వస్తున్నాయి. కాబట్టి వాటి పోటీని తట్టుకొని జనాలను ఆకర్షించాలి అంటే ప్రమోషన్స్ గట్టిగానే ఉండాలి.
అందుకే నెట్ ఫ్లిక్స్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఆలోచించినట్లుగా తెలుస్తోంది. కరణ్ అంశుమాన్ – సూపర్న్ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించిన రానా నాయుడులో మరి కొంతమంది ప్రముఖ నటనలు కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు.