పరిశ్రమలో ఎంత పెద్ద స్టార్లు ఉన్నా తనదైన ప్రతిభతో దూసుకొచ్చే నవతరం ట్యాలెంట్ కి కొదవేమీ లేదు. బాలీవుడ్ లో ఎందరు స్టార్ హీరోలు ఉన్నా తనకంటూ ఒక దారి ఉందని నిరూపించిన యువహీరో ఆయుష్మాన్ ఖురానా. ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా ఎదిగాడు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లతో సంచలనాలు సృష్టిస్తూ అపజయమెరుగని హీరోగా మారాడు. అతడి సినిమా వస్తోంది అంటే బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు ఇరుగు పొరుగు భాషల్లో హీరోలు దర్శకనిర్మాతలు ఎదురు చూస్తారంటే అతడి ఎంపికలకు ఉన్న రేంజెంతో అర్థం చేసుకోవచ్చు.
2012 లో షూజిత్ సిర్కార్ విక్కీ డోనర్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆయుష్మాన్ అంధాధున్- బధాయ్ హో- డ్రీమ్ గర్ల్ - బాలా- ఆర్టికల్ 15 దమ్ లగా కే హైషా - బరేలీ కి బర్ఫీ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయుష్మాన్ నటించిన చాలా సినిమాల్ని తెలుగులో రీమేక్ చేస్తుండడం ఆసక్తికరం. ఆయుష్మాన్ అన్ని సినిమాల్ని డి.సురేష్ బాబు కానీ టాలీవుడ్ నిర్మాతలు ఎవరో ఒకరు రీమేక్ లు చేస్తున్నారు. విక్కీ డోనర్ ఇంతకుముందు తెలుగులో రీమేకైంది. డ్రీమ్ గర్ల్ రీమేక్ లో రాజ్ తరుణ్.. అంధాధున్ రీమేక్ లో నితిన్ నటించనున్నారు. బదాయి హో- ఆర్టికల్ 15 లాంటి చక్కని క్లాసిక్ సినిమాల్ని తెలుగులోనూ ఇరుగుపొరుగు భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు.
తాజాగా ఆయుష్మాన్ ఖుర్రానా తన కొత్త ప్రాజెక్ట్ వివరాలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన తదుపరి ప్రాజెక్ట్ స్క్రిప్ట్ తో పాటు తన గురించి ఒక గూఫీ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. `డాక్టర్ జి` అనేది టైటిల్. ఇందులోఅతడి కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించనున్నాడని అర్థమవుతోంది. ``సంప్రదింపుల కోసం త్వరలో తెరుచుకుంటుంది. డాక్టర్ జి.`` అంటూ టైటిల్ ని ఆల్మోస్ట్ ఎంచుకున్న కథాంశాన్ని రివీల్ చేశాడు. ఈ కామెడీ డ్రామాకు అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించనున్నారు. జంగ్లీ పిక్చర్స్ సమర్పణలో ఇది రూపొందనుంది. 2017 చిత్రం బరేలీ కి బర్ఫీ .. 2018 చిత్రం బాదై హో తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ తో ఆయుష్మాన్ మూడవ ప్రాజెక్ట్ ఇది.
డాక్టర్ జి కంటే ముందే ఆయుష్మాన్ ఖురానా అభిషేక్ కపూర్ చండీగర్ కరే ఆషికి చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో వార్ ఫేం వాణీ కపూర్ నాయిక. నా స్వస్థలమైన చండీగర్ లో ఆనందకరమైన ప్రగతిశీల ప్రేమ కథలో నటిస్తున్నానని ఆయుష్ ఇంతకుముందు ప్రకటించారు.
ఆయుష్మాన్ ఖుర్రానా చివరిసారిగా షూజిత్ సిర్కార్ `గులాబో సీతాబో`లో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించారు. ఇది జూన్లో OTT ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. `శుభ్ మంగల్ జ్యాదా సావన్` లో కూడా నటించాడు. తాజాగా ప్రకటించిన డాక్టర్ జి పై మన అగ్ర నిర్మాతల కన్ను ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టైటిల్ లోనే బోలెడంత ఫన్ దాగి ఉంది. ఇలాంటి కాన్సెప్టులు తెలుగు పరిశ్రమకు వర్కవుట్ అవుతాయనడంలో సందేహమేం లేదు.