ర‌ష్మిక మంద‌న్న‌కు బాలీవుడ్ లో బిగ్ షాక్‌!

Update: 2022-08-30 11:00 GMT
'ఛ‌లో' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ సోయ‌గం రష్మిక మంద‌న్న‌. యంగ్ హీరో నాగ‌శౌర్య న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మ్యూజిక‌ల్ హిట్ గా నిలవ‌డంతో ఇండ‌స్ట్రీలో ప్ర‌తీ ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించిన 'గీత గోవిందం' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి ఏకంగా రూ. 100 కోట్ల క్ల‌బ్ లో చేర‌డంతో ర‌ష్మిక టాలీవుడ్ లో హాట్ టాపిక గా మారింది.

బ్యాక్ టు బ్యాక్ 'గీత గోవిందం' త‌రువాత స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్సులు ద‌క్కించుకుంటూ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకుంది. ఇటీవ‌ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో క‌లిసి న‌టించిన 'పుష్ప‌' మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

దీంతో ర‌ష్మిక క్రేజ్ మ‌రింత హైట్స్ కి చేరింది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ లో భారీ ఆఫ‌ర్ల‌ని వ‌రుస‌గా ద‌క్కించుకుని షాకిచ్చింది. ఇందులో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమా కూడా వుండ‌టం విశేషం.

సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా న‌టించిన 'మిష‌న్ మ‌జ్ను' మూవీతో బాలీవుడ్ లో తొలి అవ‌కాశాన్ని సొంతం చేసుకున్న ర‌ష్మిక ఈ మూవీ రిలీజ్ కాకుండానే మ‌రో మూడు ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్న 'గుడ్ బై', ర‌ణ్ బీర్ క‌పూర్ తో 'అర్జున్ రెడ్డి' డైరెక్ట‌ర్ సందీప్ వంగ తెర‌కెక్కిస్తున్న 'యానిమ‌ల్‌' తో పాటు టైగ‌ర్‌ష్రాఫ్ తో క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మించ‌నున్న ఓ భారీ ప్రాజ‌క్ట్ లోనూ న‌టించ‌బోతోంది. ఇటీవ‌లే టైగ‌ర్‌ష్రాఫ్ తో క‌లిసి ర‌ష్మిక ఓ యాడ్ ఫిల్మ్ లోనూ న‌టించింది. అయితే ఈ ప్రాజెక్ట్ అర్థాంత‌రంగా ఆగిపోయింద‌ని తెలిసింది.

'స్క్రూడీలా' అనే టైటిల్ తో రూపొంద‌నున్న ఈ మూవీ కోసం హీరో టైగ‌ర్‌ష్రాఫ్ కు క‌ర‌ణ్ జోహార్ పారితోషికం కింద రూ. 35 కోట్లు ఇచ్చార‌ట‌. అగ్ర‌మెంట్ కూడా చేసుకున్నార‌ట‌. అయితే షూటింగ్ మొద‌లైన త‌రువాత బాలీవుడ్ లో మారిన స‌మీక‌ర‌ణాల కార‌ణంగా టైగ‌ర్ ష్రాఫ్ ని పారితోషికం త‌గ్గించుకోమ‌ని, రూ. 20 కోట్లు పారితోషికం.. వ‌చ్చే లాభాల్లో వాటా తీసుకోమ‌ని కోరాడ‌ట క‌ర‌ణ్ జోహార్‌. అయితే టైగ‌ర్ ష్రాఫ్ మాత్రం అందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ ని అర్థాంత‌రంగా ఆపేసిన‌ట్టు చెబుతున్నారు.

న‌టీన‌టుల పారితోషికాల‌తో క‌లిసి ఈ మూవీ బ‌డ్జెట్ రూ. 140 కోట్లు అవుతోంద‌ట‌. ప్ర‌స్తుతం బాలీవుడ్ ఎదుర్కొంటున్న విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇంత బ‌డ్జెట్ తో సినిమా అంటే సాహ‌స‌మేన‌ని, రిక‌వ‌రీ క‌ష్టం అని భావించిన క‌ర‌ణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ ని అర్థాంత‌రంగా నిలిపి వేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై క‌ర‌ణ్ జోహార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News