ఆయన కోసం ఏడుగురు హీరోయిన్స్‌ ముందుకు వచ్చారు

Update: 2020-03-05 11:30 GMT
వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలీవుడ్‌ మూవీ ‘అంగ్రేజీ మీడియం’ సినిమాకు ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రాణాంతకమైన జబ్బుతో బాధ పడుతున్నారు. క్యాన్సర్‌ నుండి బయట పడ్డ ఆయన అంగ్రేజీ మీడియం సినిమాను చేశారు. ఈ సినిమాను చేస్తున్న సమయంలోనే ఆయన అనారోగ్యం కు గురయ్యారు. ఏదోలా సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్దం చేశారు.

సినిమా విడుదల సందర్బం గా ప్రమోషన్‌ లో పాల్గొనకుండా ఆయన ఇక్కడ లేకుండా పోయాడు. ప్రస్తుతం యూకేలో చికిత్స పొందుతున్న ఇర్ఫాన్‌ కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు హీరోయిన్స్‌ అది కూడా టాప్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ముందుకు వచ్చారు. ఆయన సినిమాను ఆయన లేకున్నా తాము ప్రమోట్‌ చేస్తామంటూ సినిమాకు సంబంధించిన కుడి ను నాచ్నే దే పాటకు డాన్స్‌ స్టెప్పులు వేశారు.

సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుండి కూడా కుడి ను నాచ్నే దే డాన్స్‌ బాగా ఫేమస్‌ అయ్యింది. అందుకే సినిమా ప్రమోషన్‌ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అయిన కత్రీనా కైఫ్‌.. అనుష్క శర్మ.. ఆలియా భట్‌.. జాన్వీ కపూర్‌.. కృతి సనన్‌.. అనన్య పాండే.. కైరా అద్వానీలు ఆ డాన్స్‌ ను చేశారు. సినిమాకు ఇప్పటికే మంచి పబ్లిసిటీ దక్కింది. వీరి వీడియోలతో సినిమాపై మరింత ఆసక్తి కలుగుతుందని హిందీ ప్రేక్షకులు అంటున్నారు. ఈ ఏడుగురు డాన్స్‌ వీడియో ను బిగ్‌ బి అమితాబ్‌ రిలీజ్‌ చేయడం ఇక్కడ మరింత పెద్ద విషయం.
Full View
Tags:    

Similar News