బిగ్ ఫిల్మ్స్ మధ్యలో చిన్నచిత్రాలు సాండ్ విచ్.. అవుతున్నాయా? అంటే ట్రేడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. డిసెంబర్ 2 నుంచి బాక్సాఫీస్ పై భారీ క్రేజీ చిత్రాల దండయాత్ర మొదలైంది. ఇందులో ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ` అఖండ విజయాన్ని సాధించి సరికొత్త రికార్డుల్ని నమోదు చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా వసూళ్లని రాబడుతూ తెలుగు సినిమాకు నూతనోత్తేజాన్ని అందిస్తోంది. దాదాపు రెండవ వారంలోకి ఎంటరైన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదే జోష్ ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది.
ఈ సినిమా తరువాత వరుసగా భారీ చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఈ నెల 17న బన్నీ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప : ది రైజ్` వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీపై క్రేజ్ మామూలుగా లేదు. బన్నీ - సుకుమార్ ల కలయికలో ముచ్చటగా మూడవసారి వస్తున్న సినిమా కావడం.. బన్నీ తొలిసారి ఊరమాస్ పాత్రలో నటించిన సినిమా కావడంతోసహజంగానే అంచనాలు అంబరాన్ని తాకాయి.
ఇక ఇదే ఊపులో నేచురల్ స్టార్ నాని నటించిన `శ్యామ్ సింగ రాయ్` ఈ నెల 24న రాబోతోంది. దీనిపై కూడా అంచనాలు మామూలుగా లేవు. నాని చేసిన తొలి పాన్ ఇండియా మూవీ కావడం.. దేవ దాసీ నేపథ్యంలో కొల్‌కతా బ్యాక్‌డ్రాప్ లో నడిచే కథ కావడం, క్రేజీ స్టార్స్ సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్ లుగా నటించడం వంటి కారణాలతో ఈ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సంక్రాంతి పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనవరి 7న `ఆర్ ఆర్ ఆర్` వచ్చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమా స్థాయి ఏ రేంజ్ లో వుంటుందో హింట్ ఇచ్చేసింది. ఆ తరువాత 12న భీమ్లా నాయక్, 14న ప్రభాస్ `రాధేశ్యామ్` కూడా పోటీకి దిగుతున్నాయి. ఆ తరువాత ఫిబ్రవరిలోనూ భారీ చిత్రాల దండయాత్ర కొనసాగబోతోంది.
`ఆచార్య` వరకు పెద్ద చిత్రాల దండయాత్ర వుండటంతో చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పెద్ద సినిమా రిలీజ్ ల మధ్య కొంత గ్యాప్ వున్నా ఆ మధ్యలో విడుదలయ్యే చిత్రాలు సాండ్ విచ్ లు అయిపోతున్నాయి. వీటికి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఇటీవల వచ్చిన లక్ష్య, గమనం, స్కైలాబ్ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాయి. దీంతో పెద్ద సినిమాల మధ్యలో దూర్చడం కంటే చిన్న చిత్రాలని ఆ టైమ్ లో విడుదల చేయకపోవడమే మంచిదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.