పెద్ద బ్యానర్ కు పెద్ద కష్టాలు

Update: 2019-08-03 01:30 GMT
కార్పొరేట్ సంస్థలు సినిమా రంగంలో అడుగు పెట్టడం బాలీవుడ్ లో అతి సాధారణ విషయం. కానీ తెలుగులో మాత్రం ఈ ట్రెండ్ అంతగా కనిపించడం లేదు. ఈ సంప్రదాయానికి భిన్నంగా నాలుగేళ్ల క్రితం వచ్చిన ఓ బడా కంపెనీ అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోలతో క్రేజీ స్టార్స్ తో వరసగా భారీ బడ్జెట్ తో సినిమాలు తీసింది. కానీ అవేవి కనీస స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. వంద కోట్ల మార్కెట్ ఉన్న ఓ స్టార్ తో ఫ్యామిలీ సినిమా చేస్తే అది అభిమానులకు ఎప్పుడు మర్చిపోలేనంత పీడకల రేంజ్ లో డిజాస్టర్ అయ్యింది.

ఆ తర్వాత ఇంకో స్టార్ తో ఇంగ్లీష్ రీమేక్ తీస్తే సోసోగా ఆడి బ్రేక్ ఈవెన్ అందుకుంది. తర్వాత దాని దర్శకుడితో ఏవో విభేదాలు కొంత గ్యాప్ తో అలా కాలం గడిపేసింది. ఈ సంవత్సరం పాత కమిట్ మెంట్ ఉన్న కారణంతో తమ సంస్థలో ఫ్లాప్ మూవీ ఇచ్చిన స్టార్ తో మరో ఇద్దరు పార్ట్ నర్స్ తో కలిసి ఓ సినిమా చేస్తే లాభాలు ఇవ్వలేదు కానీ పాత బాకీలు తీర్చిందని ఇన్ సైడ్ టాక్. ఇవన్నీ చూసాక పెద్ద హీరోలు ఎవరూ ఈ సంస్థతో సినిమాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఇన్ సైడ్ టాక్.

అందుకే మీడియం రేంజ్ లేదా అంత కన్నా తక్కువ నటీనటులతో థ్రిల్లర్స్ చేసుకుంటూ బిజినెస్ చేస్తోంది. నిజానికి ఇవి ఆ కంపెనీ  బ్రాండ్ కు తగ్గ సినిమాలు కావు. ఏదో ఫీల్డ్ లో ఉన్నామని చెప్పుకోవడానికి తప్పించి పెద్దగా ఉపయోగపడటం లేదు. కాకపోతే తక్కువ బడ్జెట్ కాబట్టి కమర్షియల్ గా బాగా వర్క్ అవుట్ అవుతూ లాభాలు ఇస్తున్నాయి. వీటిలో నటిస్తున్న మీడియం రేంజ్ హీరో తప్ప ఇప్పుడీ బ్యానర్ అంటే స్టార్లు ముందుకు రావడం లేదట. రెమ్యునరేషన్ ఎంత ఇస్తామన్నా లెక్క చేయకుండా వద్దు అని నేరుగా చెప్పకుండా స్మార్ట్ గా తప్పించుకుంటున్నారట. పేరుకు తగ్గట్టు సంస్థకు సినిమా కష్టాలు పెద్దగానే ఉన్నాయన్న మాట.


Tags:    

Similar News