బిగ్‌ బాస్ 6 : టమాటాలతో హీట్ పెంచారు.. ఈవారం నామినేషన్‌ లో వీళ్లు

Update: 2022-09-27 07:36 GMT
తెలుగు బిగ్‌ బాస్ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో వీకెండ్‌ ఎపిసోడ్స్ కంటే కూడా అధికంగా సోమవారం ఎపిసోడ్‌ ను చూస్తున్నారు. నాగార్జున వచ్చే ఎపిసోడ్‌ ల కంటే కూడా సోమవారం ఎపిసోడ్‌ కు మంచి రెస్పాన్స్ ఉంటున్న నేపథ్యంలో బిగ్‌ బాస్ మరింతగా ఆసక్తికరంగా సోమవారం సాగే ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ నిర్వహించేలా కొత్త కొత్త ఐడియాలతో వస్తున్నాడు.

ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ పక్రియ నిన్నటి ఎపిసోడ్‌ లో జరిగింది. నామినేషన్ లో భాగంగా ఇంటి సభ్యులు అంతా కూడా ఒక్కొక్కరు ఇద్దరిని ఎంపిక చేసుకుని వారి తల మీద టమాటా కొట్టాలి. ఏదో టమాటా కొట్టాం అనకుండా పూర్తిగా టమాటాను వారి తలపై చిదిమాల్సి ఉంటుంది. కాస్త ఇబ్బందిగానే ఉన్నా టమాటా లు చాలా హీట్‌ నే పెంచాయి.

ఇంటి సభ్యుల్లో ఎక్కువ మంది ఇనాయా సుల్తానా ను నామినేట్‌ చేశారు. ఇక ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా సింగర్ రేవంత్‌ మరి కొందరు నామినేషన్‌ లో ఉన్నారు. ప్రతి ఒక్కరి నామినేషన్ చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా శ్రీహాన్ వర్సెస్ ఇనాయా సుల్తానా ల మధ్య హీట్‌ బాగా పెరిగింది. ఇనాయా మాట్లాడుతున్న సమయంలో శ్రీహాన్‌ ప్రవర్తన కాస్త చర్చనీయాంశంగా మారింది.

బిగ్‌ బాస్ చరిత్రలో హోస్ట్‌ ఇద్దరిని నామినేట్‌ చేశారు. వారు కీర్తి భట్‌ మరియు అర్జున్‌. వారిద్దరితో పాటు ఎలిమినేషన్ కి నామినేట్‌ అయిన వారిలో సుదీప.. ఆరోహి.. గీతూ రాయల్‌.. శ్రీహాన్‌.. ఇనాయా... రాజశేఖర్‌.. సూర్య.. రేవంత్‌ లు ఉన్నారు. మొత్తం పది మంది ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్‌ అవ్వడం జరిగింది.

పది మందిలో ఇనాయా కాస్త వీక్ గా అనిపిస్తున్నా కూడా రామ్‌ గోపాల్‌ వర్మ ఆమెకు మద్దతుగా ట్వీట్స్‌ చేయడం జరిగింది. దాంతో ఆమెకు కాస్త బూస్ట్‌ దక్కే అవకాశం ఉంది. ఆమె కాకుంటే కీర్తి లేదా అర్జున్‌ లలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ బిగ్‌ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నాలుగు రోజుల్లో వారి యొక్క ఆట తీరు మారితే ఏదైనా ప్రత్యేక సంఘటన జరిగితే ఓట్లు భారీగా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక ప్రస్తుతానికి పది మందిలో ఎవరు వెళ్లి పోయేది చెప్పలేం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వారం పది మంది కంటెస్టెంట్స్ నామినేట్‌ అవ్వడంతో హౌస్ లో టాస్క్ లు రచ్చ రచ్చ ఉండే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News