గోవా బీచ్ లో బిబి బ్యూటీ అందాల ఆరబోత

Update: 2022-02-02 07:55 GMT
దివి.. ప్రస్తుతం ఈ పేరు చాలా ఫేమస్. కాని బిగ్ బాస్ కు ముందు ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు. చాలా సినిమాల్లో నటించినా కూడా ప్రతి ఒక్క దాంట్లో చిన్న చిన్న రోల్స్ అవ్వడం వల్ల కనీసం ఈమెను గుర్తించే నాధులే లేరు. కాని ఇప్పుడు ఈమె హీరోయిన్ గా సినిమా లు రూపొందుతున్నాయి. బిగ్‌ బాస్ తో వచ్చిన గుర్తింపు తో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది.

మిలియన్ ఫాలోవర్స్ కు దగ్గర ఉన్న ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్‌ హీరోయిన్స్ రేంజ్ లో రెచ్చి పోతుంది. సినిమాలు ఒక వైపు వెబ్‌ సిరీస్ లు మరో వైపు చేస్తూనే ఇలా ఇన్ స్టా గ్రామ్‌ లో అందాల ఆరబోతతో ప్రేక్షకుల ముఖ్యంగా తన అభిమానులకు కన్నుల వింధు చేస్తోంది.

తాజాగా దివి గోవా బీచ్ లో ఎంజాయ్ చేసింది. అక్కడ ఈ అమ్మడి ఎంజాయ్ ఏ స్థాయిలో ఉందో తాజాగా షేర్‌ చేసిన ఫొటోలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. సూర్య అస్తమయం బ్యూటీని ఎంజాయ్ చేస్తూ దివి గోవా బీచ్‌ లో తాను ఎంజాయ్ చేయడంతో పాటు తన ఫొటోలను ఇన్ స్టా ద్వారా షేర్ చేయడం ద్వారా అభిమానులకు మరియు ఫాలోవర్స్ కు కన్నుల వింధు చేసింది.

 థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రతి ఒక్కరికి కూడా కన్నుల పండుగ అన్నట్లుగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు మాత్రం అయ్యో దివి పాప కింద స్కట్‌ లేదా షార్ట్‌ వేసుకోవడం మర్చిపోయినట్లుగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దివి గోవా అందాల ఆరబోత ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందుతున్న తమిళ వేదాళం సినిమా రీమేక్ భోళా శంకర్ లో దివి కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. స్వయంగా చిరంజీవి ఆ విషయాన్ని బిగ్‌ బాస్ ఫినాలే వేదికపై వెళ్లడించాడు.

చిరంజీవి భోళా శంకర్ ఆలస్యం అవుతుండటం వల్ల ఈ లోపే దివి మూడు నాలుగు సినిమాలకు కమిట్‌ అయ్యింది. ఇప్పటికే ఒక వెబ్‌ సిరీస్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. మరి కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. అందాల వింధు విషయంలో బాలీవుడ్‌ టాలీవుడ్‌ ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా షో చేస్తున్న దివి ముందు ముందు టాలీవుడ్‌ తో పాటు ఇతర భాష ల సినిమాల్లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలుస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.



Tags:    

Similar News