బిగ్ బాస్‌ సీజన్ 6 స్పెషల్‌ హైలైట్ ఆమెనే!

Update: 2022-08-10 04:32 GMT
తెలుగు బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలు అవ్వబోతుంది. ఇప్పటి వరకు బిగ్‌ బాస్ అయిదు సీజన్ లకు కూడా మంచి రేటింగ్ దక్కింది. ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ కు కూడా మంచి వ్యూస్ వచ్చాయి. అందుకే బిగ్ బాస్ సీజన్ 6 ని మరింత కొత్తగా ఆకట్టుకునే విధంగా తీసుకు వచ్చేందుకు స్టార్‌ మా మరియు షో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా బిగ్ బాస్‌ సీజన్ 6 కి సంబంధించిన కొత్త ప్రోమో వచ్చింది. షో టెలికాస్ట్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ నెల చివరి వారం లోనే షో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. గత రెండు సీజన్ ల్లో మాదిరిగానే ఈ సీజన్ కంటెస్టెంట్స్ కూడా వారం పది రోజుల ముందుగానే క్వారంటైన్ లో ఉన్న తర్వాతే హౌస్‌ లోకి వెళ్లబోతున్నట్లుగా స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ గురించి పలు ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో మాదిరిగా వారు ఎంపిక అయ్యారు.. వీరు ఎంపిక అయ్యారు అనే వార్తలు ఎక్కువగా రాలేదు. ఈసారి లీక్ లకు కంటెస్టెంట్స్ నుండే షో నిర్వాహకులు వ్యూహాత్మకంగా అడ్డుకట్ట వేశారు. అయితే ఉదయ భాను విషయంలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 6 లో అత్యంత ఖరీదైన కంటెస్టెంట్‌ గా ఉదయ భాను నిలువబోతుంది అంటున్నారు. ఆమె దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూ వచ్చింది. నటిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. బుల్లితెరపై తనదైన ముద్ర ను వేసే ప్రయత్నం చేసిన ఉదయ భాను బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతుంది అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆమె బిగ్‌ బాస్ లో అడుగు పెట్టేందుకు ఈసారికి ఓకే చెప్పింది.

గత కొన్నాళ్లుగా ఉదయ భాను తాను కావాలని తగ్గిందో లేదా మరేదైనా కారణమో కానీ బుల్లి తెరపై ఎక్కువగా కనిపించలేదు. కాని బిగ్‌ బాస్ తర్వాత మళ్లీ ఉదయ భాను తిరిగి ఫామ్‌ లోకి రావడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉదయ భాను ఇద్దరు అమ్మాయిలు కూడా కాస్త పెద్ద వారు అవ్వడం తో వారిని వదిలి హౌస్ లో అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యింది.

ఆమె కాస్త ఓపికతో జాగ్రత్తగా ఉంటే ఆమె యొక్క క్రేజ్ కు పూర్తి వారాలు ఉండే అవకాశం ఉంది. విజేతగా నిలిచే అవకాశం కూడా చాలానే ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఉదయభాను బిగ్ బాస్‌ సీజన్‌ 6 కి స్పెషల్‌ హైలైట్ గా ఆమె ఉంటుంది అనేది చాలా మంది మాట.
Tags:    

Similar News