బిగ్ బాస్ షో దిగ్విజయంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదోవారంలోకి అడుగుపెట్టింది. ఐదో వారం ప్రారంభ ఎపిసోడ్ అదిరిపోయేలా మొదలైంది. హౌస్ లో మిగిలిన 12 మంది సభ్యులకు సంబంధించి ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఈ ప్రక్రియని బిగ్ బాస్ సరికొత్తగా ప్రారంభించాడు. మొదట కెప్టెన్ అలీకి నలుగురు సభ్యులని నామినేట్ చేసే హక్కు ఇచ్చాడు. అయితే నామినేషన్ ప్రక్రియ మొదలయ్యేసరికి ఆ నలుగురిలో ఒక్కరినే ఎన్నుకోవాలని కోరాడు. దీంతో అలీ.. హిమజ - రాహుల్ - వితిక - బాబా భాస్కర్ లని ఎన్నుకున్నాడు.
ఆ తర్వాత బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే కిందటి వారం రోహిణితో గుసగుసలాడటం వల్ల ఈ వారం శివజ్యోతిని డైరెక్ట్ గా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక కెప్టెన్ పదవిలో ఉండటం వల్ల అలీ ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నారు. ఇక మిగిలిన 10 మందికి నామినేషన్ ప్రక్రియ సాగింది. ఒక్కో అభ్యర్ధి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం వచ్చింది.
ఈ క్రమంలో పునర్నవి...హిమజ-రాహుల్ ని నామినేట్ చేసింది. ఆ తర్వాత బాబా భాస్కర్.. రాహుల్-అషు రవి... రాహుల్- హిమజ - వితికా షెరు.. మహేష్ విట్టా-అషు -శ్రీముఖి.. రాహుల్- అషు - రాహుల్.. హిమజ-శ్రీముఖి - అషు.. హిమజ-రాహుల్ - వరుణ్.. రాహుల్-మహేష్ విట్టా - శివజ్యోతి.. పునర్నవి - రాహుల్ - మహేష్ విట్టా.. రాహుల్- వరుణ్ సందేశ్ - హిమజ.. పునర్నవి-అషులని నామినేట్ చేశారు. చివరికి కెప్టెన్ అలీ ... బాబా భాస్కర్ ను డైరెక్ట్ గా నామినేట్ చేశారు.
మొత్తంగా ఈ నామినేషన్ ప్రక్రియలో పులిహోర రాజా ట్యాగ్ ఉన్న రాహుల్ ని ఎక్కువ మంది నామినేట్ చేశారు. అతని తరువాత హిమజను నామినేట్ చేశారు. ఇక ఈవారం ఐదో వారంలో రాహుల్ - హిమజ - అషు - మహేష్ - పునర్నవి - శివజ్యోతి - బాబా భాస్కర్ లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.