బిగ్ బాస్ సీజన్ 3లో పరిచయ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత.. హౌస్ లో తొలిరోజునే ఫిట్టింగ్ పెట్టిన విషయాన్ని తొలిరోజు ఎపిసోడ్ చివర్లో హింట్ ఇచ్చిన వైనం తెలిసిందే. దీనికి తగ్గట్లే.. తొలిరోజే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను రవికృష్ణ.. శివజ్యోతి.. అషూ రెడ్డిలు పూర్తిచేయటం తెలిసిందే.
వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానలు చెప్పలేదనుకుంటారో వారి పేర్లు చెప్పాలంటూ కొంత టైమిచ్చారు బిగ్ బాస్. దీనికి తగ్గట్లే పన్నెండుమందిలో ఆరుగురు పేర్లను ఆ ముగ్గరు డిసైడ్ చేశారు. వారిలో రాహుల్.. వరుణ్ సందేశ్.. వితికా షెరు.. శ్రీముఖి.. బాబా భాస్కర్.. జాఫర్ ల పేర్లను బిగ్ బాస్ కు తెలిపారు.
ఆ వెంటే.. ఆ ఆరుగుర్ని నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు బిగ్ బాస్. దీంతో.. తొలిరోజునే నామినేషన్ రచ్చ మొదలైందా? అన్న చర్చకు తెర తీశారు. నామినేట్ అయిన వారంతా ఒక జట్టుగా మారి.. గత సీజన్లో ఏం జరిగిందన్న అంశాల్ని గుర్తు చేసుకోవటం కనిపిస్తుంది. నామినేషన్స్ అంటే ఎలిమినేషన్స్ అన్న విషయాన్ని వారు ఫిక్స్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. హౌస్ లో బాబా భాస్కర్.. టీవీ9 జాఫర్ లు చేసిన ఎక్సర్ సైజులు నవ్వులు తెప్పించేలా సాగాయి. ఇదిలా ఉండగా.. తొలిరోజే భలే ఫిట్టింగ్ ను తెర మీదకు తీసుకొచ్చారు బిగ్ బాస్. హౌస్ ను ప్రశాంతంగా ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారో లేదో కానీ.. తొలిరోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తో లొల్లి ఒక రేంజ్లో సాగుతుందన్న భావన కలిగేలా ఉండటం గమనార్హం.
నామినేట్ అయిన ఆరుగురు తమను తాము తప్పించుకునే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అయితే.. వారంతా కలిసి ఒక మానిటర్ ను ఎంపిక చేసుకోవాలన్నారు. ఆ ఆరుగురు పుణ్యమా అని.. హేమను ఏకగ్రీవంగా మానిటర్ గా ఎంపిక చేసుకున్నారు.
ఇక.. ఐదుసార్లు బెల్ మోగుతుందని.. ఆసమయంలో నామినేట్ అయిన ఆరుగురిలో ఒకరిని ఎలిమినేషన్ నుంచి తప్పించి.. వారి స్థానంలో మిగిలిన హౌస్ మేట్స్ లో ఒకరిని ఎంపిక చేయొచ్చని చెప్పారు. ఎన్నుకున్న కారణం చెప్పినప్పటికీ.. మానిటర్ గా ఎంపికైన హేమ మాటే ఫైనల్ అని తేల్చేశారు. అదే సమయంలో హేమతో కలిసి రియాల్టీ షోలో గొడవలకు శ్రీకారం చుట్టినట్లుగా కనిపించక మానదు.
స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే గొడవలతో.. హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటారన్న దానికి భిన్నంగా బిగ్ బాస్ -3 వ్యవహారం కనిపిస్తుందని చెప్పాలి. పరిచయమైన 24 గంటల వ్యవధిలోనే హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెట్టేలా టాస్క్ ను రూపొందుతారని చెప్పక తప్పదు. తాజా టాస్క్ పుణ్యమా అని గొడవలకు కావాల్సినంత మసాలాను సిద్ధం చేసినట్లుగా కనిపించే పరిస్థితి. మరేం జరుగుతుందన్న అంశానికి సంబంధించి చూస్తే.. తొలి రోజు నుంచే సభ్యుల మధ్యనున్న సహృద్భా వాతావరణాన్ని దెబ్బ తీసేలా టాస్క్ లు ఇచ్చారని చెప్పక తప్పదు. మరి.. దీన్ని ఎలా అధిగమిస్తారన్న విషయంపై క్లారిటీ రావాలంటే మంగళవారం ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాని పరిస్థితి.