గత 13 వారాలుగా ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. మొత్తం 17 మంది కంటెస్టంట్స్ తో మొదలైన షో లో ప్రస్తుతం 7 గురు సభ్యులు మిగిలారు. ఈ 7 గురు సభ్యుల్లో ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోయి 5గురు కంటెస్టంట్స్ ఫైనల్ కు చేరుకుంటారు. అయితే బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టంట్స్ ఎవరో గేమ్ జరుగుతోన్న తీరును బట్టి స్పష్టంగా తెలిసిపోతోంది.
శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టంట్స్ కు చెందిన ఇంటి సభ్యులని ఒక్కొక్కరిని స్టేజ్ మీదకు పిలిచి ఫైనల్ 5 కు వెళ్ళే అర్హత లేని వాళ్ల పేర్లు చెప్పాలని సూచించారు. వారు పేర్లు చెప్పాక బిగ్ బాస్ ఇంటిలోని తమ కుటుంబ సభ్యులకు ఓ గిఫ్ట్ పంపించారు. ఆ గిఫ్ట్ తో పాటు నామినేషన్ నుంచి బయటపడిన వారి పేర్లని ఓ కార్డులో పెట్టారు. అలా ఇంటి సభ్యులు వచ్చి ఎక్కువగా ఫైనల్ కు వెళ్ళే అర్హతలు లేని వారిలో వితికా పేరు ఎక్కువ చెప్పగా - ఆ తర్వాత అలీ - శివజ్యోతిలు పేర్లు చెప్పారు. అయితే ఎక్కువమంది ప్రేక్షకుల మదిలో కూడా వీరి పేర్లే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇది పక్కనపెడితే గిఫ్ట్ తో పాటు వచ్చిన పేర్లలో నామినేషన్ నుంచి ముగ్గురు సేఫ్ అయ్యారు. మొదట శ్రీముఖి సేఫ్ అవ్వగా - తర్వాత రాహుల్ - బాబాలు సేఫ్ అయ్యారు. కాకపోతే ఇది ఆర్డర్ ప్రకారం జరిగితే శ్రీముఖి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అవుతుంది. ఆ తర్వాత రాహుల్ - బాబాలు ఉంటారు. అయితే ఈ ముగ్గురిలో శ్రీముఖి నాన్న ముందు వచ్చారు. కాబట్టి ఆమె గిఫ్ట్ ముందు ఓపెన్ చేయించారు. అలా కాకుండా రాహుల్ కు సంబంధించిన వారు ముందు వస్తే రాహుల్ ఫస్ట్ సేఫ్ అయ్యేవాడు.
కాకపోతే వీరి ముగ్గురుకి ఓటింగ్ ఎలా వచ్చినా ఈ ముగ్గురు టాప్3 లో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వరుణ్ కూడా టాప్3 లో ఉండే అవకాశాలు లేకపోలేదు. చివరి రోజుల్లో వరుణ్ భార్య వితికాను సేఫ్ చేసేందుకు చేసిన ప్రయత్నాలతో కాస్త మైనస్ అయ్యాడు. అటు ఇంకా నామినేషన్ లో వరుణ్ - శివజ్యోతి - అలీ - వితికాలు ఉన్నారు. వీరిలో ఎవరు ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళతారో ? చూడాలి.