టాస్క్ ఆగిపోవడానికి కారణమైన ఆ ఇద్దరికి జైల్లో చిప్పకూడు...

Update: 2019-09-05 04:05 GMT
బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ రణరంగంలా మారింది. మంగళవారం ఎపిసోడ్ లో ఇచ్చిన దొంగలు దోచిన నగరం టాస్క్ లో భాగంగా బుధవారం రెండు లెవెల్ జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి వీర లెవెల్లో తన్నుకున్నారు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో హింస పెరిగిపోయిందని వెంటనే ఈ టాస్క్ ఆపాలని సూచనలు చేశాడు. అసలు టాస్క్ అంటేనే బలప్రదర్శనకు సంబంధించింది. అలాంటప్పుడు ఇలాంటి టాస్క్ ఇవ్వకూడదు. ముందు తన్నుకుని చావమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చి..మళ్ళీ హింస పెరిగిందని ఆపమన్నాడు.

పైగా టాస్క్ ఆగడానికి కారణం ఎవరో ఇద్దరి పేర్లని చెప్పాలని ఇంటి సభ్యులకు చెప్పాడు. దీంతో అందరూ తలో రెండు పేర్లు చెప్పారు. ఎక్కువ మంది రాహుల్ - రవి ల పేర్లు చెప్పారు. వీళ్ళ వల్లే టాస్క్ మధ్యలో ఆగిపోయిందని ఎక్కువ మంది సూచించారు. దీంతో వరుణ్ వీరిని జైల్లోకి తీసుకెళ్లి బంధించాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక వారిని బిగ్ బాస్ జైల్లో పెట్టారు. అయితే అంతకముందులా వీరికి ఇంటిలో ఫుడ్ పెట్టడానికి వీల్లేదని - టీ - కాఫీలు ఇవ్వకూడదని చెప్పాడు.  బిగ్ బాస్ ఇచ్చే ఫుడ్ మాత్రమే వాళ్ళు తినాలని ఆర్డర్లు ఇచ్చాడు.

అయితే రవి జైలుకు వెళ్లడానికి కారణమైనందుకు అలీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు ఏడ్వడం ఏంటిరా అంటూ అతన్ని ఇంటిలో ఆడవాళ్లు ఓదార్చారు. తర్వాత రవి దగ్గరకు వెళ్ళి బాధపడ్డాడు. ఇక వారికి ఆహారంగా బిగ్ బాస్.. రాగి సంగటి - ఆపిల్ మాత్రమే జైలు ఫుడ్‌ గా ఇచ్చారు. జావలో కనీసం ఉప్పు - కారం కూడా లేకుండా ఇచ్చారు. ఇక జైలు ఫుడ్ తినడానికి చాలా ఇబ్బందులు పడ్డారు రాహుల్ - రవి. ఉప్పులేకుండా జావ ఎలా తాగాలి? కనీసం ఉప్పు అయినా ఉంటే బాగుండు.. అని ఇది ఇలా తాగుతుంటే జీవితంలో చేయలేని తప్పు చేస్తున్నట్టు ఉందని రవి అన్నాడు. రాహుల్ అయితే ఆ ఫుడ్ అసలు ముట్టుకోలేదు.

ఈ ఎపిసోడ్ అయ్యాక వరుణ్-వీటిక జంట మధ్య వాగ్వాదం జరిగింది. తనతో టైం స్పెండ్ చేయడం లేదని వితికా కన్నీళ్లు పెట్టుకోగా.. 24 గంటలు నీతోనే ఉంటున్నా.. ఇంకా టైం కేటాయించు అంటే ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా నీకు. మనం గేమ్ ఆడటానికి వచ్చాము. హనీమూన్‌కి కాదు అంటూ వరుణ్ క్లాస్ తీసుకున్నాడు. దీంతో వితిక ఇంకా బోరున ఏడ్చింది


Tags:    

Similar News