మ‌హ‌మ్మారీలా మారిన `బిగ్ బాస్` వ‌దిలి పోదు

Update: 2021-08-28 05:38 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షో హ‌వా గురించి తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో మొద‌లై భార‌త‌దేశంలో ఇది వైర‌స్ లా మారింది. అన్ని ప్రాంతీయ భాష‌ల‌కు విస్త‌రించింది. ఇది వ‌దిలి వెళ్ల‌నంటున్న మ‌హ‌మమ్మారీ అంటే త‌ప్పేమీ కాదు. బుల్లితెర‌కు అవ‌స‌ర‌మైన టీఆర్పీలు ఈ షో కొన‌సాగింపుకు కీల‌కంగా ఆరింది.

తెలుగు రియాలిటీ షో #బిగ్ బాస్ తాజా సీజన్ కి స‌మ‌య‌మాస‌న్న‌మైనందున ఇప్ప‌టికే బోలెడంత హంగామా నెల‌కొంది. ఈసారి పార్టిసిపెంట్స్ ఎవ‌రెవ‌రు? కొత్త సీజ‌న్ లో కొత్త ఏం ఉంటుంది? అదే మూస‌ధోర‌ణిలో ఉంటుందా? అంటూ ముచ్చ‌ట‌ మొద‌లైంది.

ఇప్ప‌టికే ప‌లువురు ఇంటి స‌భ్యుల పేర్లు ఖ‌రార‌య్యాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నడుపుతున్న సృజనాత్మక బృందం ఇంటి లోపల పోటీదారులకు ఇవ్వబడే ఆసక్తికరమైన టాస్క్ లను రూపొందించడానికి ఈసారి కొత్త ఎత్తుగ‌డ‌ల్ని అనుస‌రించ‌నున్నార‌ట‌. ఈ సంవత్సరం #బిగ్ బాస్ హిందీ OTT వెర్షన్ కొన్ని కఠినమైన నిబంధన‌ల‌తో ప్రజలను చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఈ సంవత్సరం తెలుగు వెర్షన్ లో కూడా ఇదే విధమైన ట్విస్టులు ఉండ‌నున్నాయ‌ట‌. ఇంటి స‌భ్యుల్లో పోటీదారులు కాస్త క‌ఠోర‌మైన ఫైటింగుల‌కు రెడీ కావాల్సి ఉంటుంద‌ట‌.

శారీరక శ్రమను పెంచేస్తూ రికార్డు సమయంలో మొత్తం ఈత కొలనును నింపేలా నీటిని పోయడం.. ఇంట్లోని అన్ని వస్తువులను పగలగొట్టడం.. ఇతర హింసాత్మక పనులను స్క్రిప్ట్ లో చేర్చార‌ట‌. స్టార్ మా టీమ్ .. హోస్ట్ నాగార్జున నుండి ఇంకా తుది ఆమోదం లభించాల్సి ఉంది. అవ‌స‌రం మేర కొత్త‌ద‌నాన్ని జోడించేందుకు  రైట‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. వారంలో షో ప్రారంభం కానుంది. ఈసారి సీజ‌న్ 5 కి తిరిగి కింగ్ నాగార్జున హోస్టింగ్ చేయ‌నున్నారు. నాగ్ మ‌రోసారి త‌న‌దైన శైలిలో వెరైటీ గెట‌ప్పుల‌తో వినోదాన్ని పంచుతార‌ని స‌మాచారం. ఇందులో వింత‌లు విశేషాలేమిటో చూడాల్సి ఉంటుంది. ఈసారి పార్టిసిపెంట్స్ లో గ్లామ‌ర్ యాంగిల్ ఏ లెవ‌ల్లో ఉండనుంది?  షో స్టాప‌ర్ గా నిలిచేది ఎవ‌రెవ‌రు? అన్న‌దానిపైనా హింట్ అందాల్సి ఉంది.

ఇక బుల్లితెర‌పై బిగ్ బాస్ రియాలిటీ షో ప‌ర‌మ బోరింగ్ అని తిట్టి  పోసే సాంప్ర‌దాయ వాదులు ప్ర‌తి రోజూ గంట‌ల కొద్దీ స‌మ‌యం ఈ షో వ‌ల్ల త‌మ ఇంటి గృహిణులు పిల్ల‌ల‌కు వృధా అవుతోంద‌ని క‌ల‌త చెందుతున్నారు. మ‌హ‌మ్మారీలా మారిన `బిగ్ బాస్` వ‌దిలి పోదు! అంటూ తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News