బిగ్ బాస్ రెండవ వారం రెండవ రోజు ఎపిసోడ్ లో మొదటి కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్ జరిగింది. ఈ టాస్క్ పేరు సిసింద్రీ అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. టాస్క్ లో భాగంగా ప్రతి కంటెస్టెంట్ కి కూడా ఒక బేబీ బొమ్మను ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మకి సమయానుసారంగా పిల్లలకు ఎలా అయితే సేవలు చేస్తారో అలా చేయాల్సి ఉంటుంది. అలాగే తమ బొమ్మలను కాపాడుకోవాల్సి ఉంటుంది.
టాస్క్ మొత్తం కూడా గీతూ హడావుడి చేసింది. బొమ్మలను ఎవరికి వారు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ రేవంత్ అశ్రద్దతో ఉండటం వల్ల గీతూ మెల్లగా ఆ బొమ్మ వద్దకు వెళ్లి దొంగిలించి గార్డెన్ ఏరియాలో ఉంచిన కార్ట్ లో పెట్టేసింది. దాంతో ఆట నుండి రేవంత్ బయటకు వెళ్లి పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
రాత్రి బొమ్మ ను పట్టుకుని పడుకోవాలని కోరుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కదిలించింది. మరోవైపు ఇతర కంటెస్టెంట్స్ తో కూడా గీతూ రచ్చ చేసింది. ఆటలో చాలా అగ్రెసివ్ గా దూసుకుపోతుంది. రేవంత్ తర్వాత అభినయ శ్రీ మరియు శ్రీ సత్యలు కూడా తమ బొమ్మలను కోల్పోవడంతో వారు కూడా గేమ్ నుండి ఔట్ అయ్యాడు.
మిగిలిన కంటెస్టెంట్స్ అంతా కూడా ఆటలో మరో రౌండ్ కి వెళ్లారు. ఆ రౌండ్ లో చంటి విజేతగా నిలిచాడు. దాంతో ఈ వారం మొదటి కెప్టెన్సీ కంటెండర్ గా చంటి నిలిచాడు. మొత్తానికి ఎప్పటిలాగే నిన్నటి టాస్క్ లో కూడా ఒకరు ఇద్దరు తప్ప అందరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా కొట్టుకుంటూ రంగంలోకి దిగారు.
ఈ వారం ఎలిమినేషన్ డబుల్ ధమాకా అంటూ అనుమానాలు ఉన్నాయి. అందుకే కంటెస్టెంట్స్ మరింత దూకుడుగా ఉన్నారు. ముఖ్యంగా నామినేట్ అయిన వారు పులిలా రెచ్చి పోతున్నట్లుగా అనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.