బిగ్‌బాస్ 6 టెలికాస్ట్‌ డేట్‌ ఫిక్స్‌

Update: 2022-08-15 13:46 GMT
హిందీ బిగ్ బాస్ కు ఏమాత్రం తగ్గకుండా తెలుగు బిగ్‌ బాస్ సూపర్‌ హిట్ అయ్యింది. కొన్ని ప్రత్యేకమైన తెలుగు బిగ్‌ బాస్ ఎపిసోడ్స్ ఏకంగా హిందీ బిగ్ బాస్‌ రేటింగ్స్ ను కూడా  క్రాస్ చేసిన దాఖలాలు ఉన్నాయి. స్టార్‌ మా లో టెలికాస్ట్‌ అయిన అయిదు సీజన్ లు కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు సీజన్ 6 కోసం ప్రేక్షకులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బిగ్‌ బాస్ సీజన్‌ 6 ప్రోమో ఇటీవలే వచ్చింది. ఆగస్టు లో షో ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. మొన్నటి వరకు ఆగస్టు చివరి ఆదివారం బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4వ తారీకున బిగ్‌ బాస్ సీజన్ 6 ను ప్రారంభించబోతున్నట్లుగా స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఓటీటీ వర్షన్‌ బిగ్ బాస్ నాన్‌ స్టాప్ వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు. మొన్నటి వరకు ఆ బిగ్‌ బాస్‌ నడిచింది. ఇప్పుడు రెగ్యులర్ బిగ్‌ బాస్ కు ప్రేక్షకులు అప్పుడే సిద్ధం అయ్యారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్‌ బాస్ 6 లో చాలా విభిన్నమైన కంటెస్టెంట్స్ ఉండే అవకాశం ఉందంటూ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ఉదయ భాను ను అత్యధిక పారితోషికం ఇచ్చి సీజన్‌ 6 కోసం ఎంపిక చేశారనే వార్తుల వస్తున్నాయి. మరో వారం రోజుల్లో కంటెస్టెంట్స్ అంతా కూడా క్వారెంటైన్‌ కు వెళ్లబోతున్నారు. అక్కడ నుండి డైరెక్ట్‌ గా బిగ్‌ బాస్ హౌస్ కు వెళ్లనున్నట్లుగా స్టార్‌ మా వర్గాల వారు చెబుతున్నారు.

ఈ సారి వీకెండ్‌ ఎపిసోడ్స్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత రెండు మూడు సీజన్ లుగా కంటెస్టెంట్స్‌ లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం లీక్ అవుతూ వచ్చింది. ఈ సారి అలా లీక్ అవ్వకుండా జాగ్రత్తపడబోతున్నారట.
Tags:    

Similar News