బిగ్‌ బాస్‌ : మొదటి వారమే బిగ్‌ బాస్‌ లో బిగ్‌ ట్విస్ట్‌

Update: 2022-09-08 06:30 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 సందడి మొదలయ్యింది. బిగ్‌ బాస్ ఎక్కువ శాతం ప్రేక్షకులు నామినేషన్స్‌ మరియు వీకెండ్‌ ఎపిసోడ్స్ ను మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజా ఎపిసోడ్‌ లో నామినేషన్‌ జరిగింది. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

మొదటి వారం కెప్టెన్‌ గా ఇంకా ఎవరు ఎంపిక కాని కారణంగా అందరి నుండి ఇద్దరిని ఎంపిక చేసి ఎలిమినేషన్ కు నామినేట్‌ చేయాల్సి ఉంది. కానీ మొదటి టాస్క్ లో విజేతలుగా నిలిచిన గీతూ మరియు ఆదిరెడ్డి ఇంకా నేహా లు ను మినహాయించి మిగిలిన వారిని ఎనిమినేట్‌ కి నామినేట్‌ చేయాలంటూ బిగ్ బాస్ సూచించాడు.

చివర్లో అనూహ్యంగా బిగ్‌ బాస్ ట్విస్ట్‌ ఇచ్చాడు. బిగ్ బాస్ లో అప్పుడప్పుడు డబుల్‌ ఎలిమినేషన్స్ ఉంటాయి. అది ఈ సారి మొదటి వారమే ఉండబోతుందని అతి పెద్ద ట్విస్ట్‌ ని బిగ్‌ బాస్ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ షాక్‌ అయ్యారు. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ను ఒకే సారి పంపడం లోనే ఇలాంటి చాలా ట్విస్ట్‌ లు ఉంటాయని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పకనే చెప్పారు.

బిగ్‌ బాస్ మొదటి వారం నామినేషన్ లో మొదటి టాస్క్ పూర్తి అయ్యేప్పటికి ఆదిత్య.. ఇనయ.. అభినయ శ్రీ నేరుగా నామినేట్‌ అయ్యారు. నామినేషన్స్‌ రచ్చ మొదటి వారమే పీక్స్ కి చేరింది. కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ నామినేషన్స్ చేసిన తీరు ముందు ముందు మరింత రచ్చ గా ఉంటుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈ వారం రేవంత్‌.. చంటి.. శ్రీ సత్య.. ఫైమా.. ఇనయా.. ఆరోహి.. అభియన శ్రీలు ఇంటి నుండి ఎలిమినేట్‌ అయ్యేందుకు నామినేట్ అయ్యారు. వీరిలోంచి ఇద్దరు బయటకు వచ్చేస్తారంటూ బిగ్‌ బాస్ ప్రకటించారు.

అయితే ఎలిమినేషన్ సమయంలో ఏమైనా ట్విస్ట్‌ ఇచ్చి కంటిన్యూ చేయడం లేదా సీక్రెట్‌ రూమ్‌ కి పంపడం జరుగుతుందేమో అంటూ ప్రేక్షకులు ఊహించేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే వీకెండ్‌ ఎపిసోడ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News