పిల్లలు పుట్టే ఛాన్సులేదు.. వేరే వారిని వెతుక్కో.. షాకిచ్చేలా నటి ఎమోషన్

Update: 2022-04-30 06:32 GMT
విషయం ఎలాంటిదైనా ఫర్లేదు. కాకుంటే.. ప్రతి అంశం వార్తాంశంగా మారి.. రియాల్టీ షో గురించి వీలైనంత మంది మాట్లాడాలన్న కాన్సెప్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్ వివాదాల క్వీన్ కంగనా రౌనత్ హోస్ట్ చేస్తున్న 'లాకప్' షో ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే.

ఈ షోలో పాల్గొనే ప్రముఖులు.. సెలబ్రిటీల నోటి నుంచే వచ్చే మాటలు పెను దుమారాన్ని రేపటంతో పాటు.. మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలుగా మారుతున్నాయి.

ఒక నటుడితో బడా పారిశ్రామికవేత్త ఒకరు తన ఎదురుగా తన భార్యతో సెక్సు చేయాలని కోరారని.. అతడి కోరికను మన్నించినట్లుగా చెప్పటం దగ్గర నుంచి.. అది ఇది తేడా లేకుండా షోలో పాల్గొంటున్న సెలబ్రిటీల నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ పాయల్ రోహతీ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆమె తన వ్యక్తిగత విషయాల్ని షేర్ చేసుకోవటమే దీనికి కారణం.

కెమెరా ముందు మాట్లాడిన పాయల్.. తాను గర్భవతిని కాలేనని.. పిల్లల్ని కనేందుకు తాము నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నామని.. ఐవీఎఫ్ పద్దతిలో కూడా ప్రయత్నించి ఫెయిల్ అయ్యామని పేర్కొంది. తన బాయ్ ఫ్రెండ్ సంగ్రామ్ సింగ్ కు పిల్లలు అంటే ఇష్టమని.. అతడు పిల్లల్ని కనేందుకు అర్హుడని.. తమ పెళ్లి ఆలస్యం కావటానికి ఇదో కారణంగా పేర్కొంది. ఒకవేళ తనతో పిల్లల్ని కనలేకపోతే.. అతను మరో అమ్మాయిని వెతుక్కోవచ్చంటూ ఎమోషనల్ అయ్యింది.

దీనికి స్పందించిన సంగ్రామ్ సింగ్.. పాయల్ ధైర్యవంతురాలని.. ఆమె గర్భవతి కాలేదని వైద్యులు చెప్పారన్నారు. అయితే.. తమ మధ్య ఉన్న ప్రేమ బంధానికి ఇవేమీ అడ్డంకులు కావన్నారు. తనను కాక ఇంకొకరితో సొంత పిల్లల్ని కనాలని చెప్పిందని.. దానికి తనకు నవ్వు వచ్చిందన్నారు. తామిద్దరం ఎప్పటికి కలిసే ఉంటామని పేర్కొన్నాడు. ఏమైనా.. వీరిద్దరి మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.
Tags:    

Similar News