బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటున్నారు.. కానీ రేటింగ్స్ రావడం లేదే...!

Update: 2020-10-22 02:30 GMT
టెలివిజన్ రంగంలో సూపర్ సక్సెస్ అయిన రియాలిటీ షో లలో 'బిగ్ బాస్‌' ఒకటి. హిందీ, తెలుగు, తమిళం‌, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ 'బిగ్ బాస్‌' నడుస్తోంది. బుల్లితెర ప్రేక్షకులకు అసలైన రియాలిటీ షో మజాని పరిచయం చేసిన 'బిగ్ బాస్'కు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో అదే స్థాయిలో వివాదాలు కూడా చెలరేగాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్వాహకులు ఈ షోని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక మన తెలుగు విషయానికొస్తే ఇప్పటికే మూడు సీజ‌న్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్‌ బాస్ షో.. నాలుగో సీజ‌న్‌ కొనసాగిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఎంటర్టైన్మెంట్ కి దూరమైన జనాలకు 'బిగ్ బాస్‌' సీజన్ 4 కాస్త ఉపశమనం కలిగిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న నాల్గవ సీజన్ కు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'బిగ్ బాస్‌' సీజన్ 3 ని సక్సెస్ ఫుల్ గా నడిపిన అక్కినేని నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్ కి పూర్ రేటింగ్స్ వస్తున్నాయని తెలుస్తోంది. నాగార్జున కనిపించే శని ఆదివారాలు ఓ మోస్తరు రేటింగ్ వచ్చినా మిగతా వారాల్లో జనాలు అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. నిజానికి 'బిగ్ బాస్‌' తెలుగు సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. అదే సమయంలో ఐపీయల్ క్రికెట్ సీజన్ స్టార్ట్ అవడంతో బిగ్ బాస్ రేటింగ్స్ మొత్తం ఐపీయల్ ప‌ట్టుకెళ్లిపోతోంది. అంతేకాకుండా మంచి కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి పూర్ పరఫార్మెన్స్ ఇస్తున్నవాళ్ళని ఉంచుతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన కంటెస్టెంట్లను పిలిచిమ‌రీ హడావిడి చేసి ఇంట‌ర్వ్యూలు తీసుకుంటున్నా.. వారికి పెద్దగా ఉప‌యోగం లేకుండా పోతుందని కామెంట్స్ వస్తున్నాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ రేటింగ్స్ లిస్ట్ బ‌య‌ట‌కు చెప్పి హ‌డావుడి చేసిన నిర్వాహకులు ఇప్పుడు సైలెంటుగా ఉండటం కూడా బిగ్ బాస్ సీజ‌న్ 4 ని జ‌నాలు లైట్ తీసుకుంటున్నారు అనడానికి నిద‌ర్శ‌నమని వ్యాఖ్యానిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ షో పుంజుకొని మంచి రేటింగ్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News