నాగార్జునకు 'బిగ్ బాస్' పెద్దచిక్కే తెచ్చిపెట్టిందే.. కోర్టులు కేసుల వరకు..??

Update: 2020-12-27 10:45 GMT
ఒక్కోసారి సినిమాలే కాకుండా టీవీ షోలు కూడా సినీ తారలను విభేదాలు, గొడవల్లోకి నెట్టేస్తుంటాయి. ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. మరి ఇంతకీ నాగార్జునతో విభేదానికి దిగింది ఎవరు అంటే సీనియర్ పొలిటికల్ లీడర్, సీపీఐ అగ్రనేత నారాయ‌ణ‌. ఆయనకు నాగార్జున పై కోపం ఏర్పడిందట. మరి సిపిఐ నాయకుడికి కోపం వచ్చే పని ఏం చేసాడు..? అసలు ఆయనకు కోపం రావడానికి కారణం ఏంటి అంటే మాత్రం బిగ్ బాస్ ప్రోగ్రాం. విషయం కోర్టుల వరకు తీసుకెళ్లాడానికి నారాయణ ప్రయత్నం చేశాడంటే బిగ్ బాస్ ప్రోగ్రాం.. నాగ్, నారాయణల మధ్య ఏదో అసంతృప్తి కలిగించి ఉండాలి. మరి అసలు ఎందుకు నారాయణ అంత కోపంగా ఉన్నాడో స్వయంగా క్లారిటీ ఇచ్చాడు నారాయణ. బిగ్ బాస్ ప్రోగ్రాం కాన్సెప్ట్ తప్పు అన్న నారాయణ.. అందులో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. అంతేగాక బిగ్ బాస్ షో మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినా వారు స్పందించలేదని వాపోయారు.

'నేను కూడా నాగార్జున అభిమానినే. ఆయన సినిమాలు కూడా చూస్తుంటాను. కానీ బిగ్ బాస్ షోలో మాత్రం నాగార్జున ప్రవర్తన నచ్చలేదని' తేల్చి చెప్పేసాడు నారాయణ. అలానే ఆయన కోపానికి ఒక సందర్బం కూడా చెప్పారు. 'బిగ్‌బాస్‌లో ముగ్గురు అమ్మాయిల‌ ఫోటోలు పెట్టి వీరిలో కిస్, డేటింగ్, పెళ్ళి ఎవరితో చేసుకుంటావ్? అని దారుణమైన ప్రశ్న ఓ యువ‌కుడిని నాగార్జున అడిగితే.. ఆ యువకుడు కూడా అంతే దారుణంగా సమాధానం చెప్పడం ఘోరమని నారాయ‌ణ చెప్పుకొచ్చారు. అదే నాగార్జున త‌న ఇంట్లోని మ‌హిళల ఫోటోలు పెట్టి.. ఆ ప్రశ్న అడ‌గ్గ‌లడా..? అని నారాయణ ప్రశ్నించడం షాక్ కి గురించేస్తుంది. ఇంతకాలం మంచి సినిమాలతో, మంచి కంటెంట్ తో అలరించిన నాగార్జున.. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాంస్ ఎందుకు చేస్తున్నాడని నారాయణ తెలిపారు. మహిళలకు మర్యాద ఇచ్చే ఈ మాతృభూమి మీద ఇలాంటి ప్రోగ్రాంస్ లో అలా మాట్లాడటం అన్యాయం అని ఆయన వివరించారు. ఇక ఈ విషయంలో ఎంత దూరనికైనా వెళ్తానని తెలిపిన నారాయణ.. వెంటనే నాగార్జున క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట పలు చర్చలకు దారి తీస్తోంది.


Tags:    

Similar News