సారీ చెప్పిన బిగ్ బాస్ సరయూ.. ఆ ఉద్దేశం లేదంది

Update: 2022-02-09 10:35 GMT
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్.. 7 ఆర్ట్స్ యూట్యూబ్ చానల్ నటి అయిన సరయూ క్షమాపణలు చెప్పింది. తనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ హిందూ సమాజాన్ని , మహిళలను కించపరిచేలా ఉందంటూ సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి చేసిన ఫిర్యాదు మేరకు గతంలో సరయూ పై కేసు నమోదైంది.

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సరయూ, ఆమె టీంను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసు గురించి సరయూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

‘నేను గిప్పనిస్తా’ అనే షార్ట్ ఫిలింలో తాను నటించానని.. అందులో 7 ఆర్ట్స్ కు సిరిసిల్లలో ఒక బిర్యానీ ఫ్రాంచైజీ ఓపెన్ అయ్యిందని.. ఈ బిర్యానీ ప్రమోషన్ కు గణపతి బప్పా రిబ్బన్ కట్టుకొని మందుతాగామని.. అయితే తాము ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి అలా చేయలేదని సరయూ వివరణ ఇచ్చింది.

విజయ్ సేతుపతి సినిమాలో నుంచి ఒక సీన్ ను రిఫరెన్స్ గా తీసుకునే అలా చేశామని..  కానీ సిరిసల్లలో విశ్వహిందూపరిషత్ వాళ్లకు అది నచ్చలేదని సరయూ వివరణ ఇచ్చింది. ఇందులో సీన్ మా మనోభావాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం చెప్పడంతో ఆ సీన్ ను తీసేశామని.. తర్వాత బిర్యానీ పాయింట్ ఓపెన్ చేశామని సరయూ తెలిపింది.

అంతా అయిపోయిందనుకుంటే ఏడాది తర్వాత ఆ కేసును బంజారాహిల్స్ కు బదిలీ చేశారని.. పోలీస్ విచారణ కోసం వెళ్లివచ్చానని సరయూ తెలిపింది.ఒక నటిగా దర్శకుడు ఏది చెప్తే అదే చేశానని.. ఎవరి మనోభావాలను.. హిందువులను కించపరచలేదని సరయూ వివరణ ఇచ్చింది.

నేను హిందువునేనని.. ఒక హిందూ అమ్మాయిగా నేను వారి మనోభావాలను కించపరిచను అని సరయూ తెలిపింది. మీ మనోభావాలు దెబ్బతింటే సారీ అని క్షమాపణలు చెప్పింది. Full View
Tags:    

Similar News