తెలుగు లోగిళ్లలోకి పాశ్చాత్య తుంటరి సంస్కృతిని తెచ్చిన ప్రభావవంతమైన రియాలిటీ షో `బిగ్ బాస్`. ఈ రియాలిటీ షోని మన దేశంలో సాంప్రదాయ వాదులు అస్సలు అంగీకరించని సంగతి తెలిసిందే. అయినా ఆ వ్యతిరేకతతో పనే లేకుండా `బిగ్ బాస్` పిచ్చి పీక్స్ కి చేరుకోవడం వెనక స్టార్ చానెల్ వాళ్ల కృషిని ప్రశంసించకుండా ఉండలేం. అటు ఉత్తరాది సహా ఇటు సౌత్ లోనూ ఈ కల్చర్ అంతకంతకు విస్తరిస్తూనే ఉంది. ప్రపంచం ఒక రియాలిటీ హౌస్ అనుకుంటే అందులో మనుషులంతా రియాలిటీ పార్టిసిపెంట్స్ గా మారిన ప్రస్తుత సందర్భంలో బిగ్ బాస్ టీవీ చానెళ్లకు అంతే ఇదిగా టీఆర్ పీని తెచ్చి పెడుతోంది ఈ కార్యక్రమం. దీంతో ఈ షో ప్రాంతీయ భాషల్లోనూ అంతకంతకు విస్తరిస్తోందే కానీ .. ఎక్కడా తగ్గడం లేదు.
పెళ్లాం మొగుడి మాట వినదు.. ఆడాళ్లు ఇంటిపనులు చేయరు. స్కూల్ పిల్లలు పుస్తకం ముందేసుకుని బిగ్ బాస్ చూస్తారు. బిగ్ బాస్ వస్తే చూస్తూనే కూచుంటారు! అందుకే బిగ్ బాస్ తెలుగులోనూ అంత పెద్ద సక్సెసయ్యిందని విశ్లేషిస్తున్నారు. ఇంత గొప్ప రియాలిటీ షో కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్న వాళ్లున్నారా? అంటే ఉన్నారనే చెబుతున్నారండోయ్. అటు బాలీవుడ్ లో ఇప్పటికే సల్మాన్ హోస్ట్ గా ఈ కార్యక్రమం జోరందుకుంటోంది. ఈలోగానే ఇటు తమిళంలో ఊపు కనిపిస్తోంది. తెలుగులోనూ బిగ్ బాస్ సీజన్ 3కి ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఇక్కడ మాత్రం ఎందుకనో తొలి రెండు సీజన్లలో కనిపించినంత జోష్ కనిపించడం లేదు. మొదటి సీజన్ సక్సెస్ అయినంతగా రెండో సీజన్ సక్సెస్ కాకపోవడంతో స్టార్ - మా వాళ్లు ఆలోచనలో పడ్డారన్న ముచ్చట కూడా వినిపిస్తోంది.
ఇప్పటివరకూ తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ కన్ఫామ్ కాలేదు. నాగార్జున - వెంకటేష్ - అనుష్క - రేణు దేశాయ్ అంటూ రకరకాల పేర్లు తెరపైకి వచ్చినా ఎవరూ కన్ఫామ్ కాలేదు. జూలై లో మొదలెట్టేస్తున్నాం అని చెబుతున్నా.. ఏదీ లేదన్న మాటా వినిపిస్తోంది. జూన్ వచ్చినా సరే ఎలాంటి అప్డేట్స్ లేవ్. అసలు ఎందుకీ డైలెమా? అంటూ అభిమానుల్లో కొత్త సందేహాలు రేకెత్తుతున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 3 లేదట కదా? అని `స్టార్- మా` ప్రతినిధుల్ని వాకబు చేస్తే .. అబ్బే అలాంటిదేం లేదు. తొందర్లోనే ప్రారంభం అవుతుంది. ఇంకా సెలక్షన్స్ సాగుతున్నాయి. కింగ్ నాగార్జున హోస్ట్ అని చెబుతున్నారు. అంటే పాశ్చాత్య సంస్కృతిని తెలుగు లోగిళ్లలో బలంగా పాతేసే ప్లాన్ లో ఉన్నారనే దీనర్థం!!