బిగ్ బాస్ సీజన్ 3 రికార్డు స్థాయి రేటింగ్ ను దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఇంప్రెషన్స్ ను దక్కించుకున్న బిగ్ బాస్ ఈ సీజన్ రేటింగ్ విషయంలో కాస్త నిరుత్సాహం వ్యక్తం అవుతోంది. భారీ రేటింగ్ ను ఊహించిన స్టార్ మా తాజా రేటింగ్స్ తో ఇంకా ఏదో చేయాలని భావిస్తుందట. మొదటి రోజు కంటెస్టెంట్స్ పరిచయం ఎపిసోడ్ కు మంచి రేటింగ్ వచ్చినా ఆ తర్వాత ఎపిసోడ్స్ విషయంలో నిరుత్సాహం వ్యక్తం చేశారు. షో ను లైట్ తీసుకున్నట్లుగా అనిపించింది. మోనాల్ తో అఖిల్ మరియు అభిజిత్ లు కలుపుతున్న పులిహోర కూడా పెద్దగా ప్రయోజనం కలిగించలేదు అనిపించింది.
మొదటి వారం ఓవరాల్ గా ఈ సీజన్ కు 18.5 రేటింగ్ వచ్చింది. సాదారణంగా అయితే ఇది మంచి రేటింగ్. కాని గత సీజన్ లతో పోల్చితే ఇంకా ఎక్కువగా ఊహించారు. ఇక చాలా నెలలుగా నెం.1 గా కొనసాగుతూ వస్తున్న వంటలక్క సీరియల్ కార్తీక దీపంను మాత్రం బిగ్ బాస్ క్రాస్ చేయలేక పోయాడు. గత వారంలో వంటలక్క సీరియల్ ఎప్పటిలాగే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకుంది. మొదటి వారం కంటే పులిహోర సీన్స్ ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం షో కు మంచి రేటింగ్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు.
ఈ సీజన్ లో రెండవ వారం అత్యధిక రేటింగ్ దక్కించుకుంటుందని నమ్మకంగా ఉన్నారు. నిన్న మొన్నటి ఎపిసోడ్స్ కు వచ్చిన స్పందన చూస్తేంటే కార్తీక దీపంను క్రాస్ చేసే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. వంటలక్కను కేవలం మోనాల్ తో అఖిల్ మరియు అభిజిత్ లు కలిపే పులిహోర సీన్ తోనే చెక్ పెట్టవచ్చు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగేనో చూడాలి.