తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదట్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితా దాదాపుగా సిద్దం అయ్యింది. ఈసారి హీరోయిన్స్ కు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఒక వైపు కంటెస్టెంట్స్ తో అగ్రిమెంట్ చేసుకుంటూ మరో వైపు బిగ్ బాస్ సెట్ ను రెడీ చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. ఈ సమయంలో హోస్ట్ నాగార్జున ఆగస్టు నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గితేనే షో ప్రారంభించాలంటూ నిర్వాహకులకు సూచించాడట.
ఆగస్టులో కేసులు తగ్గడం లేదా వ్యాక్సిన్ రావడం ఏదో ఒకటి జరుగుతుంది. రెంటిలో ఏదో ఒకటి జరిగినా కూడా అనుకున్నట్లుగా బిగ్ బాస్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాని కేసులు తగ్గకుండా మరింతగా పెరిగి వ్యాక్సిన్ వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని ప్రకటన వస్తే మాత్రం మరో నెల లేదా రెండు నెలల పాటు బిగ్ బాస్ ను ఆలస్యం చేసే అవకాశమే ఎక్కువగా ఉందని స్టార్ మా వర్గాల వారు అంటున్నారు.
వచ్చే నెలలో కేసుల ఉదృతి కాస్త తగ్గినా కూడా 20 రోజుల పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను క్వారెంటైన్ లో ఉంచి ఆ తర్వాత వారికి పరీక్షలు నిర్వహించి అప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారు. ఆగస్టు రెండవ లేదా మూడవ వారంలో ఇది జరిగే అవకాశం ఉంది. అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఈసారి 20 రోజులు అనధికారికంగా బిగ్ బాస్ లో ఎక్కువగా ఉండబోతున్నారన్నమాట.