లక్ష ఇస్తాం సహకరించాలన్నారు.. దూకి చావండన్నాను

Update: 2021-11-04 23:30 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 లో శ్వేత వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెల్సిందే. ఆమె చాలా కాలంగా సినిమాల్లో కమర్షియల్స్ లో నటిస్తూ వస్తుంది. కాని ఇప్పటి వరకు ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. కాని బిగ్ బాస్ వల్ల శ్వేత వర్మకు మంచి గుర్తింపు దక్కింది. హౌస్‌ లో ఆమె ఉన్నది ఏడు వారాలు అయినా కూడా ఆమె ఏంటీ.. ఆమె మనస్థత్వం ఏంటీ అనేది అందరికి తెల్సింది. ఆమె తనకు నచ్చితే ఎంత దూరం అయ్యి వారికి సాయం చేసేందుకు సిద్దంగా ఉంటుందని.. తన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని తేల్చి చెప్తుంది. ఎంతో మంది కంటెస్టెంట్స్ తో ఆమె ముక్కుసూటిగా మాట్లాడి కాస్త గొడవలు తెచ్చుకుంది. తాజాగా హౌస్‌ నుండి ఆమె బయటకు వెళ్లి పోయిన తర్వాత చాలా ఆసక్తికర విషయాల గురించి సోషల్‌ మీడియా ద్వారా మరియు మీడియా ద్వారా తెలియజేస్తూ వచ్చింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్వేత వర్మ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడింది. ఆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది తనతో అసభ్యంగా మాట్లాడటం.. కమిట్‌ మెంట్‌ అంటూ అడగడం చేశారు. పారితోషికం ఎంతైనా ఇస్తాం.. మాకు సహకరించాలని అనేవారు. అప్పుడు నాకు ఆ విషయం అర్థం అయ్యేది కాదు. సహకరించక ఏం చేస్తాం.. ఖచ్చితంగా మంచిగా నటించి వారికి మంచి పేరు తేవడంతో పాటు తాను మంచి పేరు తెచ్చుకుంటాను కదా అనుకునేదాన్ని. కాని ఆ తర్వాత సహకరించడంకు వేరే అర్థం ఉందని తెలుసుకున్నాను. ఒకసారి ఒక వ్యక్తి నాకు ఫోన్‌ చేసి యాడ్‌ లో మీరు నటించాలి. అందుకు లక్ష రూపాయలు పారితోషికంగా ఇస్తాం. కాని మాకు కమిట్‌ మెంట్‌ ఇవ్వాలంటూ అడిగాడు.

2015 సంవత్సరం అది.. ఆ సమయంలో నేను అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ సమయంలో నాతో అలా మాట్లాడటంతో కోపం వచ్చి నాకు లక్ష రూపాయలు ఇస్తే నేను కమిట్‌ మెంట్ ఇవ్వాలంటున్నారు.. మరి నేను అడిగినట్లుగా ఎత్తైన బిల్డింగ్ మీద నుండి దూకి చస్తారా అంటూ ప్రశ్నించాను. దాంతో అవతల వైపు సైలెంట్. అతడికి ఆ విషయంలో ఎలాంటి స్పందన రాలేదు. నేను ఏ సమయంలోనే ట్యాలెంట్‌ ను నమ్ముకుని ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నాను. అంతే కాని నాకు ఏ ఒక్కరి సాయం కాని... ఏ ఒక్కరికి కమిట్‌ మెంట్ ఇవ్వడమో అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది. బిగ్‌ బాస్ తర్వాత సినిమాల్లో మరియు వెబ్‌ సిరీస్ ల్లో ఆఫర్లు వస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News