BIGGBOSS5: శృతి మించిన శ్రీరామ్‌ సన్నీల గొడవ.. ఆనీ మాటలు

Update: 2021-10-29 06:53 GMT
బిగ్ బాస్‌ సీజన్‌ 5 సగంకు పైగా పూర్తి అయ్యింది.. భారీ అంచనాల నడుమ లోనికి వెళ్లిన షన్నూ కెప్టెన్ అవ్వలేదు ఏంటీ అంటూ అంతా కూడా అసంతృప్తితో ఉన్న సమయంలో ఎట్టకేలకు షన్ను కాస్త కెప్టెన్‌ షన్నూ అయ్యాడు. కెప్టెన్ గా షణ్ముఖ్‌ అంత ఈజీగా ఏమీ కాలేదు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో కష్టపడి ఆడాడు. అతడు ఈసారి తెలివిని ఉపయోగించడంతో పాటు ఫిజికల్‌ గా కూడా కష్టపడ్డాడు. ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొన్న షన్నూ కెప్టెన్సీ దక్కడంతో వాటికి సమాధానం ఇచ్చినట్లయ్యింది. జెస్సీ సంచాలక్ గా వ్యవహరించిన కెప్టెన్సీ టాస్క్‌ లో ఫైనల్ వరకు సిరి మరియు షన్నూలు ఉండటం.. సిరిని ఓడించి షన్నూ కెప్టెన్‌ గా గెలవడం జరిగింది. షన్నూను కెప్టెన్‌ గా ప్రకటించే అవకాశం జెస్సీకి దక్కింది. మొత్తానికి తాజా ఎపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా సాగింది.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా థర్మకోల్‌ బాల్స్ తో నింపి ఉన్న బ్యాగ్ ను ఒక సర్కిల్‌ లో తిరుగుతూ కెప్టెన్సీ కంటెండర్స్ అయిన సన్నీ.. మానస్‌.. శ్రీరామ్‌.. ఆనీ.. షన్ను.. సిరిలు కాపాడుకోవాల్సి ఉంటుంది. మొదటగా ఈ టాస్క్ ను సంచాలక్ అయిన జెస్సీ అర్థం చేసుకోలేక పోయాడు. దాంతో కన్ఫెషన్ రూమ్‌ కు అతడిని పిలిచి మరీ మళ్లీ గేమ్‌ ను మళ్లీ మొదలు పెట్టించారు. అలా అనూహ్యంగా ఆనీ మరియు షన్నులు బయటకు వెళ్లి మళ్లీ లోనికి వచ్చే అవకాశం దక్కించుకున్నారు. టాస్క్ గురించి క్లీయర్ గా క్లారిటీ వచ్చిన తర్వాత మళ్లీ మొదటి నుండి జెస్సీ టాస్క్ ను మొదలు పెట్టడం జరిగింది. అందులో మొదటగా సన్నీ మరియు శ్రీరామ్‌ లు ఒకరిపైకి ఒకరు ఎటాక్‌ అయ్యారు. మొదటి రౌండ్ లో సన్నీ గేమ్‌ నుండి ఔట్ అయ్యాడు. ఆ సమయంలో శ్రీరామ్ మరియు సన్నీల మద్య మాటల యుద్దం జరిగింది. ఇద్దరు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇద్దరికి ఇద్దరు కూడా మాటలు శృతి మించినట్లుగా మాట్లాడుకుంటూ ఫిజికల్‌ అవుతారా అన్నట్లుగా సీరియస్ అయ్యారు.

ఆ తర్వాత రౌండ్ లో శ్రీరామ్ చంద్ర గేమ్ నుండి ఔట్‌ అయ్యాడు. మానస్‌ మరియు ఇతర కెప్టెన్సీ పోటీదారుల మద్య జరిగిన పోటీలో మానస్ బయటకు వెళ్లి పోయాడు. ఆ తర్వాత స్నేహితులు అయిన సిరి మరియు షన్నూలు ఇంకా ఆనీ మాస్టర్ ఉన్నారు. కెప్టెన్ అవ్వాలని చాలా బలంగా కోరుకున్న ఆనీ మాస్టర్ కు సిరి మరియు షన్నూలు ఆ అవకాశం దక్కనివ్వలేదు. ఆమెను ఇద్దరు ఎటాక్ చేసే ప్రయత్నం చేయడంతో ఆమె ఇద్దరు కలిసి ఆడుతున్నారు అంటూ కాస్త వారిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడింది. సహనం కోల్పోయిన ఆనీ తన బ్యాన్ ను తానే కిందకు పడేసి ఆట నుండి తప్పుకుంది.

ఆ సమయంలో వాడు అది అంటూ షన్నూ మరియు సిరిలను ఉద్దేశించి కాస్త ఘాటుగానే మాట్లాడింది. ఆ మాటలు శృతి మించినట్లుగా అనిపించాయి. చివరకు షన్నూ మరియు సిరిల మద్య ఫైనల్ పోటీ జరిగింది. ఆ సమయంలో సిరి నడవకుండా ఆగిపోవడంతో జెస్సీ ఇంటి కొత్త కెప్టెన్‌ గా షన్నూను ప్రకటించడం జరిగింది. షన్నూ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత అందరితో కలిసి పోయేందుకు ప్రయత్నించాడు. కాని కొందరు మాత్రం అతడు కెప్టెన్‌ అవ్వడం జీర్ణించుకోలేక పోతున్నారు. ముందు ముందు గేమ్‌ సీరియస్ మూడ్‌ లోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా సన్నీ మరియు మానస్‌ లు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో షన్నూ కూడా తన గేమ్‌ ను తాను ఆడుతూ కూల్ గా వెళ్లి పోతున్నాడు.
Tags:    

Similar News